Bramayugam: ఆడియాన్స్లో అలజడి పుట్టించే భ్రమయుగం..తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Bramayugam: ఆడియాన్స్లో అలజడి పుట్టించే భ్రమయుగం..తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) హీరోగా భ్రమయుగం(Bramayugam) తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్‌ హారర్ థ్రిల్లర్‌ ఫిబ్రవరి 15న మలయాళంలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది.

మలయాళంలో థియేటర్స్కి వచ్చిన ఈ మూవీలో స్టార్ మమ్ముట్టి నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హారర్ థ్రిల్లర్‌‌‌‌ జానర్‌‌‌‌లో కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్‌ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. 

లేటెస్ట్గా భ్రమయుగం తెలుగు రిలీజ్ డేట్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 23న భ్రమయుగం తెలుగులో వచ్చేస్తుంది..లెజెండరీ మమ్ముక్క రీసెంట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన భ్రమయుగం చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌.అలాగే, మునుపెన్నడూ లేని భయానక అనుభూతిని పొందండని చెబుతూ ఆడియాన్స్లో అలజడి పుట్టించేశారు.ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్,వై నాట్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 

72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. గతేడాది మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం క‌న్నూర్ స్క్వాడ్‌ (Kannur Squad) సినిమా రిలీజైన మూడు వారాల్లో కేర‌ళ‌లో దుమ్ము దులిపేసింది. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన క‌న్నూర్ స్క్వాడ్‌ మూవీ..వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.85 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అలాగే రీసెంట్ ఫిల్మ్ కాదల్ ది కోర్ మూవీతో మరో హిట్ అందుకున్నారు మమ్ముట్టి.