OG Movie: మాఫియాకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్..ఓజీ నుంచి క్రేజీ టాక్!

OG Movie: మాఫియాకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్..ఓజీ నుంచి క్రేజీ టాక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(OG). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సిజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్ నుండి వస్తున్న సినిమాల్లో ఓజీ సినిమాకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం ఈ సినిమాలో పవన్ మొదటిసారి గ్యాంగ్ స్టార్గా కనిపించనున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రేండింగ్ లోకి వస్తోంది. 

లేటెస్ట్గా ఓజీ నుంచి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్ మాఫియా డాన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కథ రీత్యా మాఫియా డాన్‌ అయిన పవన్‌..అనుకోని కొన్ని కారణాలవల్ల పదేళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉండాల్సి వస్తుందని..ఇక 10 ఏళ్ల తర్వాత మాఫియాకు వ్యతిరేకంగా బరిలోకి దిగి..శత్రుమూకను అంతం చేస్తాడనే న్యూస్ సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే ఓజీ సినిమా మెయిన్ స్టోరీ అని..మరి అందులో నిజమెంత తెలియాలంటే ఫ్యాన్స్ సెప్టెంబర్‌ 27 వరకు ఆగాల్సిందే.

ప్రొడ్యూసర్ DVV దానయ్య  నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా..తమిళ నటుడు అర్జున్ దాస్ (Arjun Das), శ్రియ రెడ్డి (Shreya Reddy), ప్రకాష్ రాజ్(Prakash Ra) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్గా నటిస్తున్నాడు.