Lokesh Kanagaraj: లియో సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్

Lokesh Kanagaraj: లియో సీక్వెల్‌పై  క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్

లోకేష్ కనగరాజ(Lokesh Kanagaraj)..ఆడియన్స్కు ఈ పేరు వింటే..ఏదో మ్యాజిక్..అదేదో తెలియని స్ట్రాంగ్ ఫీలింగ్ కలుగుతుంది. అందుకు కారణం లేకపోలేదు..లోకేష్ తెరకెక్కించిన నగరం మూవీ నుంచి మొన్నటి లియో వరకు ఆడియన్స్లో ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చారు.తీసింది కేవలం ఐదు సినిమాలే కానీ, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ను క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. 

ఆయన తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలు అయితే మరో ఎత్తు. ఈ సినిమాలతో లోకేష్ అంటే ఇది అనేలా ఒక సిగ్నేచర్ క్రియేట్ చేసేశాడు.దీంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది కూడా ఫ్యాన్స్ ఫాలో అయ్యేలా చేశాడు. ఇదిలా ఉంటే ఆయన రీసెంట్గా ఓ మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..దళపతి విజయ్తో తీసిన లియో మూవీ సీక్వెల్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

లియో సీక్వెల్ రాబోయే రోజుల్లో కచ్చితంగా ఉంటుందని, అయితే దానికి చాలా సమయం పడుతుందని చెప్పాడు. ప్రస్తుతం హీరో విజయ్ ఆలోచనలు వేరే మార్గంలో ఉన్నాయని, అతనికి సక్సెస్ రావాలని కోరుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు.దీంతో విజయ్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ ఇచ్చాడని ఖుషి అవుతున్నారు. అదేంటీ? లియో అంతలా సక్సెస్ కాలేదు..అనుకున్నంత స్థాయిలో కథనం లేదని ఆడియన్స్ ఫీల్ అయ్యిన ఫ్యాన్స్కు ఎందుకు హ్యాపీగాఉన్నారంట..విజయ్ తిరిగి సినిమాల్లోకి రావడం కన్ఫర్మ్ అనే సమాచారం ఇవ్వడమే.

ఎందుకంటే విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తుండటంతో సినిమాలు అపేస్తానని చెప్పటమే. కానీ,లియో ఖచ్చితంగా ఉంటుందని లోకేష్ చెప్పడంతో..తమ ఫేవరేట్ హీరో వస్తుండటం పట్ల ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి.

లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.