టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో సీక్వెల్ సిత్రాలు 

టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో సీక్వెల్ సిత్రాలు 

టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం సీక్వెల్స్ హంగామా బాగా కొనసాగుతోంది. ఒక భాగంలో కథను చెప్పలేకపోతే సెకండ్ పార్ట్‌‌‌‌ తీయడం ఒకెత్తు అయితే..  సినిమా సక్సెస్ అయితే రెండో పార్ట్ తీయడం మరొక ఎత్తులా మారింది. ఇప్పుడు తెలుగులో ఈ రెండింటి  ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.  తాజాగా ఈ లిస్టులో చాలా సినిమాలు ఉన్నాయి. సీక్వెల్‌‌‌‌ అనగానే ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరుగుతాయి. ప్రస్తుతం ఇలాంటి ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతోన్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

రేంజ్ ఇంక్రీజ్: సీక్వెల్ సినిమాలు హీరోల క్రేజ్‌‌‌‌ను కూడా పెంచుతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి అక్కర్లేదు. అప్పటివరకు టాలీవుడ్‌‌‌‌లోనే స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్‌‌‌‌ను ‘బాహుబలి 2’ పాన్ ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌గా మార్చింది. ఒకానొక దశలో సీక్వెల్స్‌‌‌‌కు హిట్ రాలేని సందర్భంలో  ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీకి ట్రెండ్‌‌‌‌ సెట్టర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. అప్పటి నుంచి టాలీవుడ్‌‌‌‌లో సీక్వెల్స్ హవా మరింత పెరిగింది. తాజాగా ‘సలార్’తో సాలిడ్ హిట్‌‌‌‌ను అందుకున్న ప్రభాస్ మరో సారి ‘సలార్‌‌‌‌‌‌‌‌2’తో ప్రేక్షకుల ముందుకొచ్చేందు కు రెడీ అవుతున్నాడు.

అలాగే ‘పుష్ప’రాజ్‌‌‌‌గా పాన్‌‌‌‌ ఇండియా రేంజ్‌‌‌‌లో తన  క్రేజ్‌‌‌‌ను ఇంక్రీజ్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రంతో  వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా  పాపులారిటీ తెచ్చుకున్నాడు.  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ప్రస్తుతం ‘పుష్ప ద రూల్’ సినిమా చేస్తున్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ  మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు అప్పటి వరకు ప్లాపుల్లో ఉన్న రామ్‌‌‌‌కు ‘ఇస్మార్ట్‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌’ సక్సెస్‌‌‌‌ను ఇవ్వడంతో పూరిజగన్నాథ్‌‌‌‌తో ‘డబుల్ ఇస్మార్ట్‌‌‌‌’గా రెడీ అవుతున్నాడు రామ్.

మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే యంగ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండేళ్ల  క్రితం‘డీజే టిల్లు’గా తను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. దీంతో సిద్ధు మార్చి 29న ‘టిల్లు స్వ్కేర్‌‌‌‌‌‌‌‌’ మూవీతో మరోసారి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేయడానికి వస్తున్నాడు. అలాగే  ఐదేళ్ల క్రితం ‘గూఢచారి’గా ఆకట్టుకున్న  అడివి శేష్.. ఈ ఏడాది ‘గూఢచారి2’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. ఇక లేట్‌‌‌‌గా వచ్చిన లేటెస్ట్‌‌‌‌గా వచ్చినట్టు  యంగ్ హీరో తేజ సజ్జా ఈ సంక్రాంతికి హను మాన్‌‌‌‌గా వచ్చి అందరి మనసులు దోచుకున్నాడు.

ఇదే జోష్‌‌‌‌తో ‘జై హను మాన్’అంటూ సీక్వెల్ ప్రకటించి అందరి దృష్టి తనవైపు పడేలా చేసుకున్నాడు తేజ.  అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ సీక్వెల్స్ వస్తున్నాయి .  తొమ్మిదేళ్ల క్రితం ‘గీతాంజలి’గా ఆకట్టుకున్న అంజలి.. ఇప్పుడు దానికి సీక్వెల్‌‌‌‌తో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక పదేళ్ల క్రితం ‘ప్రతినిధి’గా వచ్చిన నారా రోహిత్ ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌‌‌‌తో త్వరలోనే రాబోతున్నాడు.  

కథకు కొనసాగింపు: ఒక పార్ట్‌‌‌‌లో చెప్పలేని  కథను ప్రేక్షకులకు అర్ధమయ్యేలా  రెండు భాగాలుగా చెప్పాలనేది దర్శకుడి ఆలోచన. దానికి తగ్గట్టుగానే మొదటి భాగం ప్రకటించినప్పుడే దీనికి కొనసాగింపు ఉంటుందని ప్రకటిస్తారు. తాజాగా ఎన్టీఆర్ నటిస్తోన్న ‘దేవర’ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించ బోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో ఎన్టీఆర్ కంప్లీట్ మాస్ లుక్‌‌‌‌లో కనిపించనున్నాడు. అలాగే ప్రభాస్ సీక్వెల్ నటిస్తున్న మరో మూవీ ‘ప్రాజెక్ట్‌‌‌‌ కె’ కల్కి  2898 ఏడీ టైటిల్‌‌‌‌తో సైన్ ఫిక్షన్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఒక భాగానికి సంబంధించి షూటింగ్ పూర్తయిందని, రెండో భాగం చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తోంది. ఇలా కథకు కొనసాగింపుగా వచ్చిన కేజీయఫ్, బాహుబలి లాంటి చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేశాయి. 

చాన్నాళ్ల తర్వాత: కమల్ హాసన్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఎవర్‌‌‌‌‌‌‌‌గ్రీన్‌‌‌‌గా నిలిచే చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత దీనికి కొనసాగింపుగా  భారీ అంచనాలతో  ‘భారతీయుడు 2’ చిత్రం వస్తోంది. ప్రెస్టేజీ యస్ ప్రాజెక్టుగా శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఫైనల్‌గా.. కొన్ని కథకు అవసరం లేకపోయినా, సక్సెస్ వస్తే సీక్వెల్, ప్రీక్వెల్  తీసే ప్లాన్స్ చేస్తున్నారు కొందరు దర్శక నిర్మాతలు. వాటిలో భాగంగానే ఇటీవల విడుదలైన ఈగల్, సైంధవ్, స్కంద, పెదకాపు లాంటి చిత్రాలకు సీక్వెల్స్‌‌‌‌ను ప్రకటించారు. కానీ ఈ చిత్రాలకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో వీటిలో ఏ సినిమా రెండో పార్ట్ దిశగా అడుగులు వేస్తుందో చూడాలి.