సికింద్రాబాద్ మహంకాళి ఏరియాలో ..పన్నీర్ కొంటున్నారా..? జాగ్రత్త.... 3 వేల కిలోల కల్తీ పన్నీర్ సీజ్

సికింద్రాబాద్ మహంకాళి ఏరియాలో ..పన్నీర్ కొంటున్నారా..? జాగ్రత్త....  3 వేల కిలోల కల్తీ పన్నీర్ సీజ్

రాను రానూ కల్తీ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పాలు మొదలుకొని  నుంచి అల్లం పేస్ట్, టూత్ పేస్ట్ వరకు దేన్నీ వదలకుండా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు.  సికింద్రాబాద్ లో   కల్తీ పన్నీర్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 

మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని   కల్తీ పన్నీర్  తయారీ కేంద్రాన్ని  ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ , మహంకాళి పోలీసులు ,జీహెచ్ఎంసీ అధికారులు మార్చి 18న  దాడి చేసి  3  వేల కిలోల కల్తీ పన్నీర్ ను సీజ్ చేశారు.  శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్,  కర్డ్ షాపుతో సహా ఆరు షాపులపై దాడులు చేసిన అధికారులు  శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ లో 1600 కిలోల పన్నీర్, విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్ లో1000 కిలోల కల్తీ పన్నీర్ ను  సీజ్ చేశారు.   నగరంలోని  పలు ప్రాంతాల్లో పన్నీరు అమ్ముతున్న నిర్వాహకుల షాపుల్లో   ఫుడ్ ఇన్స్పెక్టర్ తో సహా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేస్తున్నారు.

వారం రోజుల్లో మూడో ఘటన

నిన్న (మార్చి 17) హైదరాబాద్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడిలో భారీ స్థాయిలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసి సుమారు రూ.2.5 లక్షల విలువైన అల్లంపేస్ట్​ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. టప్పాచబుత్రా మలైమెట్ ప్రాంతంలోని ‘సహారా ఇండియా’ పేరిట నడుస్తున్న కేంద్రంలో మొహమ్మద్ జాఫర్ ఆలయ(42) కల్తీ పేస్ట్ తయారు చేస్తున్నాడు.  అల్లం-వెల్లుల్లి పేస్ట్‌‌‌‌‌‌‌‌లో సిట్రిక్ యాసిడ్, అధిక ఉప్పు వంటి రసాయనాలు కలిపి కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. 1,155 కిలోల కల్తీ పేస్ట్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు.

మార్చి 13న అంబర్‌ పేట్ పరిధిలోని రహత్ నగర్ దగ్గర NR ఎంటర్ప్రైజెస్ పేరుతో నడుస్తున్న కర్డ్ (పెరుగు) తయారీ యూనిట్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేశారు.  2500 కిలోల పెరుగు,  సుమారు 15 కిలోల కాస్టిక్ సోడా ,  20 లీటర్ల అసిటిక్ అన్హైడ్రైడ్ , 150 గ్రాముల CHR Hansen , 150 గ్రాముల Danisco (థర్మోఫిలిక్ కల్చర్స్) ను   స్వాధీనం చేసుకున్నారు.