వైరల్ వీడియో: శవాన్ని తరలిస్తుండగా.. కుప్పకూలిన హెలికాప్టర్

వైరల్ వీడియో: శవాన్ని తరలిస్తుండగా.. కుప్పకూలిన హెలికాప్టర్

తూర్పు నేపాల్ లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. బుధవారం(మార్చి18) ఖోటాంగ్ జిల్లాలో  ఓ వ్యవసాయ భూమిలో ల్యాండ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ఘటన లో ఎలాంటి  ప్రాణ నష్టం జరగలేదు. హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్సకోసం మరో హెలికాప్టర్ ద్వారా  ఖట్మండ్ కు తరలించారు. హెలికాప్టర్ కూలుతున్న సమయంలో ఆ దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.  ఉత్కంఠభరితమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

తూర్పు నేపాల్ లోని ఖోటాంగ్ జిల్లాలో  వ్యవసాయ భూమిలో ల్యాండ్ అవుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది. హెలికాప్టర్ కూలుతున్న దృశ్యాలు  సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. హెలికాప్టర్ చదునైన మైదానంలో దిగేందుకు యత్నించగా అకస్మాత్తుగా అదుపుతప్పి పక్కకు దూసుకుపోయి కూలిపోయిన దృశ్యం వీడియోలో కనిపిస్తోంది.

హెలికాప్టర్ లో ఖట్మండ్ నుంచి ఖోటాంగ్ జిల్లాకు ఓ శవాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ప్రమాద సమయంలో ఐదుగురు ప్యాసింజర్లు హెలికాప్టర్ లో ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఒకరు  గాయపడ్డారు.  పైలట్ తో సహా మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.  

నివేదికల ప్రకారం.. బుధవారం ఉదయం 11.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ 'ఎయిర్ డైనస్టీ'కి చెందినదిగా తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో వీచిన బలమైన గాలులు, దుమ్ము పేరుకుపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన ప్రయాణికుడిని చికిత్సకోసం మరో హెలికాప్టర్ ఖట్మండ్  కు తరలించారు.