ఇంద్రాణి సూపర్ ఉమెన్ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్

ఇంద్రాణి సూపర్ ఉమెన్ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్

యానీయా భరద్వాజ్, క‌‌‌‌బీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఇంద్రాణి’.  స్టీఫెన్ పల్లం ద‌‌‌‌ర్శకుడిగా పరిచ‌‌‌‌యమ‌‌‌‌వుతున్న ఈ చిత్రాన్ని స్టాన్లీ సుమన్ బాబు నిర్మిస్తున్నారు.  టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా రిలీజ్ చేయనున్నారు.  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన నిర్మాత అనిల్ సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ  మూవీ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

దర్శకుడు స్టీఫెన్ మాట్లాడుతూ ‘ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. విజువల్ వండర్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. టైమ్ మెషిన్‌‌‌‌, రోబో కీల‌‌‌‌కంగా ఉంటుంది. రాబోయే 50 సంవ‌‌‌‌త్సరాల్లో ఇండియా ఎంత అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌గా ఉండ‌‌‌‌నుంది అనేది ఈ సినిమాలో చూపించాం’ అని చెప్పాడు.  సూప‌‌‌‌ర్‌‌‌‌మేన్ మూవీలా, ఇది సూపర్ ఉమెన్ చిత్రమన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్. నటులు శతాఫ్, అంకిత, కో ప్రొడ్యూసర్ కెకె రెడ్డి తదితరులు పాల్గొన్నారు.