గణేష్ ఊరేగింపులో బుర్ఖాతో డ్యాన్స్..యువకుడు అరెస్ట్

గణేష్ ఊరేగింపులో బుర్ఖాతో డ్యాన్స్..యువకుడు అరెస్ట్

గణేష్ చతుర్థి సందర్భంగా ఓ యువకుడు బుర్ఖా ధరించి డాన్స్ చేయడం వివాదాస్పందంగా మారింది.  ఈ ఘటన  తమిళనాడులోని వెల్లూరులో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  బుర్ఖా ధరించి డాన్స్ చేయడాన్ని ఆక్షేపిస్తూ  పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు అరుణ్‌ కుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.   

Also Read : విషాదంలో మలయాళ సినీ ఇండస్ట్రీ..లెజండరీ డైరెక్టర్ కన్నుమూత

రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా ఉందని పోలీసులు తెలిపారు. గణేష్ ఉత్సావాల్లో మతపరమైన భావాలను దెబ్బతీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అయితే అరుణ్ ఎందుకు బుర్ఖా  ధరించి డ్యాన్స్ చేశాడు? దాని వెనుక అతని ఉద్దేశం ఏమిటి? మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే ఉద్దేశంతో ఈ చర్య చేశారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

అరుణ్ తో  పాటుగా మరికొందరు కూడా బుర్ఖా  ధరించి డ్యాన్స్ చేశారని తెలుస్తోంది. వారి కోసం ప్రస్తుతం వారి గురించి పోలీసులు వెతుకుతున్నారు.