విషాదంలో మలయాళ సినీ ఇండస్ట్రీ..లెజండరీ డైరెక్టర్ కన్నుమూత

విషాదంలో మలయాళ సినీ ఇండస్ట్రీ..లెజండరీ డైరెక్టర్ కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మలయాళ డైరెక్టర్ కేజీ జార్జ్ (KG George) (77) కన్నుమూశారు. అయన గత కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతూ ఇవాళ (సెప్టెంబర్ 24న) తుది శ్వాస విడిచారు. తాజాగా కేరళ కక్కనాడ్ లోని వృద్ధాశ్రమంలో మరణించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. 

Also Read : స్టార్ క్రికెటర్తో పూజా హెగ్డే పెళ్లి.. అందుకే సినిమాలకు దూరం?

కేజీ జార్జ్ సినిమా ఇండస్ట్రీ కి గాను ఎన్నో రకాలుగా సేవలందిస్తున్నారు. మొదట 1975లో స్వప్నదానం అనే మూవీతో ఇండిస్టీకి పరిచయమయ్యారు. ఆ సినిమాకు గాను నేషనల్ అవార్డు(National Award) వరించింది. డైరెక్టర్ గా తన తొలి చిత్రంతోనే నేషనల్ వైడ్ గా గుర్తింపు పొంది..తర్వాత వ్యామోహం, యవనిక, ఇరకల్, మేళా, ఎలవంకోడు దేశం, మహానగరం, ఆడమింటే వారియెల్లు పలు సినిమాలను డైరెక్ట్ చేశాడు. 1970-80 మధ్య కాలంలో బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ జార్జ్. అతని స్టోరీ, క్రాఫ్ట్ చాలా పరిపూర్ణంగా ఉంటాయి. అందులో యవనిక వంటి క్లాసిక్స్ ఎవరు గ్రీన్. 

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను కేరళ ప్రభుత్వం  జైసీ డేనియల్ అవార్డుతో సత్కరించింది. అంతేకాకుండా డైరెక్టర్  కేజీ జార్జ్ కొత్త ఫిల్మ్ మేకింగ్ స్కూల్ ను స్థాపించారు. ఆయన మలయాళ సింగర్‌ సెల్మా జార్జ్‌ని 1977లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. కాగా..వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మలయాళ స్టార్ మమ్ముట్టి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో కెజి జార్జ్‌కు సంతాపం తెలుపుతూ..'నా హృదయానికి దగ్గరగా ఉన్న మరొక వ్యక్తి  వీడ్కోలు చెప్పాడు, రిగార్డ్స్ జార్జ్ సర్.అంటూ పేర్కోన్నారు.