మంచి ప్రాక్టీస్ తో ఫ్యాక్టరీల్లో జీరో యాక్సిడెంట్ సాధించవచ్చు: మంత్రి వివేక్

మంచి ప్రాక్టీస్ తో  ఫ్యాక్టరీల్లో జీరో యాక్సిడెంట్ సాధించవచ్చు: మంత్రి వివేక్
  • వర్కర్స్ హ్యాపీగా ఉంటేనే  బెస్ట్ రిజల్ట్
  •  టెక్నాలజీకల్ చేంజెస్ అడాప్ట్ చేసుకోవాలె
  • మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: మంచి ప్రాక్టీస్ తో  ఫ్యాక్టరీల్లో జీరో యాక్సిడెంట్ సాధించవచ్చని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంక టస్వామి అన్నారు. కార్మికులు సంతోషంగా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం.. డైరెక్టర్ అఫ్ ఫ్యాక్ట రీస్, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇవాళ రవీంద్ర భారతిలో జరిగిన 55వ జాతీయ భద్రతా దినోత్సవంలో పాల్గొన్నారు.

 ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. సేఫ్టీ అనేది ముఖ్యమైందని, సేఫ్టీ ఉంటేనే ఉత్పత్తి బాగుంటుందని పేర్కొన్నారు. ఒకప్పుడు చాలా వరకు యాజమాన్యాలు ఖర్చు పెరుగుతుందని వెనుకడుగు వేసేవని, ఇప్పుడు ఆ ధోరణి మారిందన్నారు.. ప్రతి మేనేజ్ మెంట్ సేఫ్టీ మీద ఇన్వెస్ట్ మెంట్ చేయాల న్నారు. సాంకేతికంగానూ చాలా మార్పులు వచ్చాయని, ఫ్యాక్టరీలు వాటిని అడాప్ట్ చేసుకోవాలని సూచించారు. 

 సిగాచి ఫ్యాక్టరీ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఉంటే అంత పెద్ద  ప్రమాదం జరిగేది కాదన్నారు.రాష్ట్రం త్రీ ట్రిలియన్ ఎకానమీ కావాలని సీఎం రేవంత్రెడ్డి చెబుతు న్నారని, ఇందులో పరిశ్రమలదే మేజర్ పార్ట్ అని చెప్పారు. పరిశ్రమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాని ఆదేశించారు.