- పెద్దారెడ్డి లిఫ్ట్ స్కీం డీపీఆర్ సమర్పించాలె
- మంత్రులు దామోదర, ఉత్తమ్, వివేక్
- సచివాలయంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష
- జులై నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందించాలని ఆదేశం
హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులు పూర్తి చేయాలని మంత్రులు దామోదర రాజ నర్సింహా, ఉత్తమ్ కుమార్రెడ్డి, వివేక్ వెంకటస్వామి అధికారుల ను ఆదేశించారు. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల డీపీఆర్ ను శరవేగంగా రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన సిందూరు ప్రాజెక్టు రాష్ట్రం పేపీపై ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
డ్యామే సేఫ్టీ ప్ర భుత్వానికి చాలా ముఖ్యమని మంత్రులుపే ర్కొన్నారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు డ్యామ్ ను పరిరక్షించాలని, డ్యామ్ సేఫ్టీ నిర్మాణ పనులపై టెక్నికల్ కమిటీని నియమించాలని సూచించారు. ఆంరోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులకు ఉగా దిలోగా శంకుస్థాపన చేసేలా చూడాలని ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26 లోగా పూర్తి చే యాలన్నారు. చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు పారునీరు అందించాలన్నారు.
