వచ్చేవి జమిలీ ఎన్నికలే..నేను పోటీచెయ్యను నెక్ట్స్ నా కొడుకే: గుత్తా సుఖేందర్ రెడ్డి

వచ్చేవి జమిలీ ఎన్నికలే..నేను పోటీచెయ్యను నెక్ట్స్ నా కొడుకే: గుత్తా సుఖేందర్ రెడ్డి
  • రాజకీయంగా చాలా మార్పులొస్తయ్
  • టికెట్ వస్తే మా అబ్బాయి పోటీ ఖాయం
  •  నేను ప్రత్యక్ష ఎన్నికలకు దూరం
  • మండలి చైర్మన్గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్

హైదరాబాద్: రాబోయేది జమిలి ఎన్నికలేనని..నియోజకవర్గాల పునర్విభజనతో పరిస్థితులన్నీ మారతాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్పిన వారు ఇప్పుడు సైలెంట్ అయ్యారని విమర్శించారు. చిట్ చాట్సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'మళ్లీ మేము అధికారంలోకి వస్తామన్న వాళ్లు సైలెంట్ అయ్యారు. వచ్చేవి జమిలి ఎన్నికలే. నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది. మహిళా రిజర్వేషన్లు వస్తాయి. రాజకీయంగా చాలా మార్పులు వస్తాయి. రిజర్వేషన్లు మారతాయి. మా అబ్బాయి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఇప్పుడు చెప్పలేం. అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటం. మా అబ్బాయికి టికెట్ వస్తే పోటీ చేస్తారు. రాజకీయాల్లోకి వచ్చాకా పోటీ చేయరా? నేను ప్రత్యక్ష ఎన్నికలు దూరంగా ఉంట' అని తెలిపారు.

రెండేండ్లలో ఎల్బీసీ పూర్తి

ఎల్బీసీ పాత విధానంలో పనులు నడుస్తున్నాయి. ఒక్క రోజులో 20 మీటర్ల పనులు జరుగుతున్నాయి. దాదాపు రెండేండ్లు సమయం పట్టే అవకాశం ఉంది. ఔట్ లెట్ నుంచి పనులు చేస్తున్నారు. ఒకవైపు నిర్మాణం ఇంకో వైపు బ్లాస్టింగ్ విధానంలో పనులు కొనసాగుతుతున్నాయి. ఎలిమినేటి మాధవ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, గ్రావిటీ కెనాల్ ఎల్బీసీ, ఏఎంఆర్పీ కింద ఉన్న 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు' అని గుత్తా అన్నారు.