పుణ్యక్షేత్రాలకు పాదయాత్ర చేసి వెళ్లేవారిని తరచూ చూస్తుంటాం. తిరుమల, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లే భక్తుల్లో ఎక్కువమంది స్వామి మాల ధరించి వెళ్లేవారు ఉంటారు. కొంతమంది మొక్కు ప్రకారం పాదయాత్రగా వెళ్తుంటారు. కానీ ఓ భక్తుడు కర్ణాటక నుంచి శ్రీశైలానికి సాష్టాంగ యాత్ర చేసి తన అపార భక్తిని చాటుకున్నాడు. కర్ణాటకకు చెందిన మల్లేశ్ అనే శివభక్తుడు శ్రీశైలానికి సాష్టాంగ యాత్ర చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కర్ణాటక లోని అల్లివారిగ ప్రాంతం నుంచి శ్రీశైలానికి సుమారు 500 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్తున్న మల్లేశ్ భక్తికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్స్. మల్లేశ్ వెంట అతని తల్లి కూడా ఉండటం విశేషం. ఎర్రటి ఎండలో మల్లేశ్ అపర సంకల్పానికి ఆ శ్రీశైల మల్లన్న తప్పకుండా కరుణిస్తాడని అంటున్నారు నెటిజన్స్ .
పదిహేను రోజుల క్రితం ఈ యాత్ర ప్రారంభించానని.. శ్రీశైలం చేరుకోవడానికి మరో పది, పన్నెండు రోజులు పడుతుందని అంటున్నాడు మల్లేశ్. ఈ యాత్ర చేయడం తనకేం కష్టంగా లేదని.. మనసులో మల్లికార్జునస్వామిని స్మరించుకుంటూ యాత్ర చేస్తున్నానని అంటున్నాడు మల్లేశ్.
