T20 World Cup: హే బ్రూక్ బ్రో.. పిచ్  ఫోటోను ముందే తీసుకో.. లేదంటే మ్యాచ్ ఓడిపోతావ్ 

T20 World Cup: హే బ్రూక్ బ్రో.. పిచ్  ఫోటోను ముందే తీసుకో.. లేదంటే మ్యాచ్ ఓడిపోతావ్ 

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఈరోజు నుంచి సెమీ ఫైనల్ షురూ అయింది. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి సెమీ ఫైనల్ జరుగుతుంది. రేపు (మార్చి 5న) టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్  మధ్య రెండో సెమీ ఫైనల్ ఉండనుంది. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్ లో గెలవడం కోసం భారత్ ఏదైనా చేస్తుందని బాంబు పేల్చారు. పిచ్ మార్చే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపాడు. 

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ముంబై వాంఖడే వేదికగా రెండో సెమీస్ జరగనుంది. ఈ స్టేడియానికి సంబంధించిన పిచ్  ఫోటోను ముందే ఫోటో తీసుకోవాలని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్  కి పాక్ మాజీ క్రికెటర్  సక్లైన్ ముస్తాక్  సూచించాడు. లేకపోతే మ్యాచ్ ఓడిపోయే సమయంలో పిచ్ మొత్తం మార్చేస్తారని టీమిండియాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అప్పుడు ఇంగ్లీష్ టీమ్ ఓడిపోయి సూర్యకుమార్ సేన వెళ్లే అవకాశం ఉంటుందని హెచ్చరించాడు. కాబట్టి హ్యారీ బ్రూక్ చాలా జాగ్రత్తగా ఉండి పిచ్ కు సంబంధించిన ఫోటోలు తీసుకోవాలని చెప్పాడు. ఇండియన్స్ ని ఎప్పుడూ నమ్మొద్దని.. వాళ్లు అంపైర్లను కూడా కొనేసి మ్యాచ్ గెలుస్తారని ఆరోపించారు.
 
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ సెమీ ఫైనల్ కి టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. ఫామ్ లేని అభిషేక్ శర్మ పై వేటు వేసి హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ ని తుది జట్టులోకి తీసుకోస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు వెస్టిండీస్ పై విజయం సాధించిన తర్వాత వివాదాస్పదంగా సెలబ్రేషన్స్ చేసుకున్న సంజు శాంసన్ పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఈ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని  జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.