టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా జరుగుతున్న వీరి వివాహ వేడుకలు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఈ రోజు ( మార్చి 4న ) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణలో ఈ స్టార్ కపుల్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు భారీగా తరలిరావడంతో పోలీసులు బంజారాహిల్స్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
విజయ్ భావోద్వేగ మాటలు
రిసెప్షన్ వేడుకకు కొద్ది గంటల ముందు, ఈ జంట తెలుగు మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూనే, ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది.. ఆమెను మీరంతా మంచిగా చూసుకోవాలి, మీ ఆశీస్సులు మాకు కావాలి అంటూ విజయ్ తన సతీమణి రష్మికను పరిచయం చేశారు. మా జర్నీలో మీడియా ఎప్పుడూ ఒక భాగంగానే ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక జంటగా మీ ముందుకు రావడం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. కాలం గడిచిపోతోంది, మేం పెద్దవాళ్లం అవుతున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం. మీరు మా గుండెల్లో ఉంటారు అని పేర్కొన్నారు.
కొత్త అధ్యాయం మొదలైంది
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. మేం కలిసి జీవితంలో ఒక అందమైన కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాం. మీ అందరి ప్రేమ, మద్దతు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అని ఆమె చిరునవ్వుతో తెలిపారు. మీ ఆదరాభిమానాలతో ముందు సాగుతామని అన్నారు.
అభిమానులకు 'స్పెషల్ దావత్'
సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు అత్యంత రహస్యంగా జరుగుతుంటాయి. కానీ, విజయ్ - రష్మిక మాత్రం తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా వేల సంఖ్యలో అభిమానులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేసి, అందరినీ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. అభిమానుల పట్ల విజయ్ చూపిన ఈ ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గ్రాండ్ గా రిసెప్షన్
మార్చి 4న ఏర్పాటు చేసిని రిసెప్షన్ కు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైయ్యారు.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డెకరేషన్, లైటింగ్ ఈ వేడుకకు హైలైట్‌గా నిలింది.. ఈ 'విరోష్' వేడుకను కవర్ చేయడానికి తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా ఆసక్తి కనబరిచింది.. మొత్తానికి, రీల్ లైఫ్‌లో 'గీత గోవిందం'గా అలరించిన ఈ జంట, రియల్ లైఫ్‌లోనూ ఒక్కటవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
