Rao Bahadur: ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రండి.. 'రావు బహదూర్' రిలీజ్ వేళ వెంకటేష్ మహా క్రేజీ రిక్వెస్ట్!

Rao Bahadur: ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రండి.. 'రావు బహదూర్' రిలీజ్ వేళ వెంకటేష్ మహా క్రేజీ రిక్వెస్ట్!

టాలీవుడ్ వర్సటైల్ యాకర్ట్ సత్యదేవ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' (Rao Bahadur). ఈ క్రేజీ చిత్రం వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కించారు.  'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాల తర్వాత వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  ఈ సినిమా ఈ శుక్రవారం ( జూలై 3, 2026న  ) గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగాయి.

ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రండి..

కంటెంట్‌పై విపరీతమైన నమ్మకంతో ఉన్న దర్శకుడు వెంకటేష్ మహా.. సినిమా లవర్స్‌కి ఒక ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ చేశారు. థియేటర్లలోకి వచ్చేటప్పుడు ఎలాంటి ముందస్తు అంచనాలు, ఊహలు లేకుండా మైండ్ ఖాళీగా పెట్టుకుని రండి.. స్క్రీన్ పై కథ ఎలా సాగుతుందో అలా ఫీల్ అవ్వండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. వెంకటేష్ మహా మార్క్ అన్‌కన్వెన్షనల్ స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాలో పీక్స్‌లో ఉండబోతుందని ఈ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి.

మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్ ట్విస్ట్

ఈ 'రావు బహదూర్' చిత్రానికి అతిపెద్ద హైలైట్ దాని క్లైమాక్స్ ట్విస్ట్ అని తెలుస్తోంది. అంతరించిపోతున్న ఒక జమీందారీ, రాచరిక వ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ సైకలాజికల్ డ్రామాలో సత్యదేవ్ క్యారెక్టరైజేషన్ చాలా విచిత్రంగా, మిస్టరీగా ఉంటుంది. సినిమా అంతా హీరో ప్రవర్తన ప్రేక్షకులను అయోమయంలో పడేసినప్పటికీ.. క్లైమాక్స్ చివరి నిమిషాల్లో వచ్చే ఆ షాకింగ్ అండ్ ఎమోషనల్ రివీల్ థియేటర్లలో అందరి మైండ్స్ బ్లాక్ చేస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

సెన్సార్ కట్స్.. మహేష్ బాబు ప్రెజెంట్స్!
ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెన్సార్ బోర్డ్ ఆదేశాల ప్రకారం.. సినిమాలో ఉన్న మహాత్మా గాంధీ , ఎమర్జెన్సీ'కి సంబంధించిన కొన్ని కీలక రెఫరెన్సులను మేకర్స్ తొలగించారు. అసలు ఆ సీన్స్ కథలో ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకున్నాయనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

ALSO READ :చిన్న సినిమాకు అండగా రానా..

ఈ చిత్రంలో దీపా థామస్ హీరోయిన్‌గా నటించగా.. వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన GMB ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సమర్పిస్తుండటం సినిమా రేంజ్‌ను మార్చేసింది. శ్రీ చక్రా ఎంటర్‌టైన్‌మెంట్స్, A+S మూవీస్,మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 3న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి..