నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'హ్యాంగ్ మాన్'... ఉరితీసే 'తలారి’ కథలో బ్రహ్మాజీ!

నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'హ్యాంగ్ మాన్'... ఉరితీసే 'తలారి’ కథలో బ్రహ్మాజీ!

ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేస్తున్నా.. బలమైన కథ, కొత్త కాన్సెప్ట్‌తో వచ్చేవి మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'హ్యాంగ్‌మ్యాన్'. ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీ బాట పట్టంది.  జూలై 3 నుంచి ఈ చిత్రం Sun NXTలో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

దర్శకుడు విహాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వినయ్ నల్లకడి, బన్నీ అభిరామ్, రామారావు జాదవ్, సన్నీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో పెద్దగా చూడని ఓ అరుదైన వృత్తి చుట్టూ తిరిగే కథను తెరకెక్కించారు.

►ALSO READ \ చిన్న సినిమాకు అండగా రానా.. రెండు రాష్ట్రాల్లో 'అమీర్ లోగ్' గ్రాండ్ రిలీజ్‌

వారసత్వంగా ప్రభుత్వ ఉరిశిక్షలను అమలు చేసే తలారి జీవితమే ఈ సినిమా ప్రధాన కథాంశం. న్యాయస్థానం విధించిన శిక్షను అమలు చేయడం అతని బాధ్యతే అయినా.. ప్రతి ఉరిశిక్ష తర్వాత అతని మనసులో జరిగే సంఘర్షణ, నైతిక సందేహాలు, కుటుంబంపై పడే ప్రభావం, సమాజం చూపే వివక్ష వంటి అంశాలను థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో చూపించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఉరిశిక్ష అమలు చేసే వ్యక్తి కూడా మనిషే అనే కోణాన్ని ఈ సినిమా ఎమోషనల్‌గా ఆవిష్కరించారు. దీంతో ఈ మూవీపౌ భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.

 

కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ వివిధ కారణాలతో ఆలస్యమై ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది. సస్పెన్స్, ఎమోషన్, మిస్టరీ అంశాల కలయికగా రూపొందిన 'హ్యాంగ్‌మ్యాన్' ప్రేక్షకులను ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి. కొత్త తరహా కథలు, కంటెంట్ బేస్డ్ థ్రిల్లర్లను ఇష్టపడే సినీప్రియులకు ఈ చిత్రం మంచి ఛాయిస్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి...