చిన్న సినిమాకు అండగా రానా.. రెండు రాష్ట్రాల్లో 'అమీర్ లోగ్' గ్రాండ్ రిలీజ్‌

చిన్న సినిమాకు అండగా రానా.. రెండు రాష్ట్రాల్లో 'అమీర్ లోగ్' గ్రాండ్ రిలీజ్‌

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి నేతృత్వంలోని 'స్పిరిట్ మీడియా' ఒక చిన్న చిత్రాలకు పెద్ద అండగా నిలుస్తోంది. లేటెస్ట్ గా సరికొత్త కంటెంట్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'అమీర్ లోగ్' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను  దక్కించుకుంది. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు రానా టీమ్ సిద్ధమైంది. ఈ చిత్రంలో  కామెడీతో పాటు ఆకట్టుకునే కంటెంట్ ఉండటంతో  దీనిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు స్పిరిట్ మీడియా ముందుకు వచ్చింది.

హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఆసక్తికర కథే ఈ 'అమీర్ లోగ్. వారి స్నేహం, ప్రయాణంతో పాటు నేటి యూత్‌కి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలా దర్శకుడు రమణా రెడ్డి సోమ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

►ALSO READ | 'టాక్సిక్' లేడీ గ్యాంగ్ వచ్చేసింది.. యష్‌తో తలపడనున్న ఆ ఐదుగురు భామలు.. టీజర్ అదిరిపోయిందిగా!

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన ప్రతీ కంటెంట్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తో పాటు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'అవ్వల్ దావత్' సాంగ్ మాస్ ఆడియెన్స్‌ను, ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాపై ఉన్న అంచనాలను ఈ కంటెంట్ మరింత పెంచేసింది.

ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా.. వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. రానా 'స్పిరిట్ మీడియా' లాంటి పెద్ద సంస్థ తోడవడంతో 'అమీర్ లోగ్' చిత్రానికి ఇండస్ట్రీలో క్రేజీ బిజినెస్ ఓపెన్ అయింది. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.