'ఆ బ్యాక్ షాట్స్ ఏంటి'? ఫోటోగ్రాఫర్స్‌పై విరుచుకుపడ్డ నేహా ధూపియా!

'ఆ బ్యాక్ షాట్స్ ఏంటి'? ఫోటోగ్రాఫర్స్‌పై విరుచుకుపడ్డ నేహా ధూపియా!

సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా కెమెరాలతో వెంటాడటం పాపరాజీలకు అలవాటైంది. ఇటీవల కాలంలో కొందరు ఫోటోగ్రాఫర్స్ పరిధులు దాటి ప్రవర్తిస్తున్న తీరుపై హీరోయిన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.  లేటెస్ట్ గా బాలీవుడ్ నటి నేహా ధూపియా ముంబైలో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్‌లో మీడియా ప్రతినిధులపై  విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

నేహా వార్నింగ్

ఈవెంట్ ముగించుకుని వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్స్ వెనక వైపు నుంచి  కెమెరాలు జూమ్ చేయడాన్ని గమనించిన నేహా ధూపియా.. అక్కడికక్కడే ఆగి వారిని గట్టిగా నిలదీశారు. ఇలాంటి పద్ధతి లేకుండా బ్యాక్ షాట్స్ ఎవరు తీస్తున్నారు? అసలు ఇవేం పద్ధతులు? నాకే కాదు.. ఏ హీరోయిన్‌కు కూడా ఇలాంటి షాట్స్ తీయకండి. మీకు ఇలా చెప్పి చెప్పి మాకు ఓపిక నశించింది. మేం బయటకి వచ్చేది మా పని కోసం.. అంతే కానీ మీరు ఇలా ప్రవర్తించడానికి కాదు అంటూ కెమెరాల ముందే క్లాస్ పీకారు. 

తోడైన సోనాక్షి సిన్హా.. 

నేహా ధూపియా ధైర్యాన్ని నెటిజన్లు అభినందిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఆమెకు మద్దతుగా నిలిచింది. వైరల్ అవుతున్న వీడియో కింద 'వెల్ డన్ నేహా!!!' అంటూ కామెంట్ పెట్టి తన సపోర్ట్ చాటుకుంది. నిజానికి, కొద్దిరోజుల క్రితమే సోనాక్షి కూడా పాపరాజీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త జహీర్ ఇక్బాల్, తల్లిదండ్రులు శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హాలతో కలిసి ఫ్యామిలీ డిన్నర్‌కు వెళ్లినప్పుడు.. ఫోటోగ్రాఫర్స్ పరిధులు దాటి కారు దాకా వెంటాడటంతో సోనాక్షి తీవ్ర అసహనానికి లోనైంది.

ALSO READ : 'టాక్సిక్' లేడీ గ్యాంగ్ వచ్చేసింది.. యష్‌తో తలపడనున్న ఆ ఐదుగురు భామలు.. 

జూమింగ్ సంస్కృతిపై ఫైర్

ఒక్క నేహా, సోనాక్షి మాత్రమే కాదు.. గతంలో జాన్వీ కపూర్, పాలక్ తివారీ, జరీన్ ఖాన్ వంటి ఎందరో తారలు ఈ 'జూమ్ ఇన్' సంస్కృతిపై మండిపడ్డారు. హీరోయిన్లు ఫోటోలకు ఫోజులిచ్చి వెనుతిరిగే క్రమంలో వారి బ్యాక్‌సైడ్‌ని కెమెరాలతో జూమ్ చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పెట్టడంపై సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేహా ధూపియా చేసిన ఈ క్రేజీ అటాక్ తర్వాతైనా పాపరాజీల పద్ధతి మారుతుందో లేదో చూడాలి..