ఇది కదా ట్విస్ట్ అంటే.. రిటైర్మెంట్ రోజే ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్.. ఇంతకీ కేసు ఏంటంటే..

ఇది కదా ట్విస్ట్ అంటే.. రిటైర్మెంట్ రోజే ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్.. ఇంతకీ కేసు ఏంటంటే..

దొంగ ఏదో ఒక రోజు దొరకక పోడు.. తప్పు చేస్తే ఏదో ఒక రోజు శిక్ష పడకపోదు.. అంటుంటారు పెద్దలు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ కేసులో అది నూటికి నూరుపాళ్లు నిజమని తేలింది. లేదంటే.. సర్వీస్ లో ఉన్నప్పుడు వందల కోట్లు నొక్కేసి.. ఎందరినో మేనేజ్ చేసి.. దర్జాగా అధికారం చెలయించారన్న ఆరోపణలున్న ఐఏఎస్ ఆఫీసర్.. కరెక్టుగా రిటైర్మెంట్ రోజే అరెస్టు కావడం ఏంటి..? ఇండియా వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసు  వివరాలు ఇలా ఉన్నాయి. 

అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసులో హర్యానాకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ను సీబీఐ అధికారులు బుధవారం (జులై 01) అరెస్టు చేయడం సంచలనంగా మారింది. హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (హెచ్‌ఎస్‌పిసిబి) సభ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్‌.. 169 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు ఆరోపణలతో అరెస్టయ్యారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నట్లు నటించి  చండీగఢ్‌లోని ఐడీఎఫ్‌సీ  ఫస్ట్ బ్యాంక్ శాఖకు ప్రభుత్వ నిధులను ట్రాన్స్ ఫర్ చేశారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు.

బ్యాంకింగ్ మోసంలో హర్యానా ప్రభుత్వ శాఖకు ఇంత భారీ ఆర్థిక నష్టం వాటిల్లడం ఇదే మొదటిసారి సీబీఐ తెలిపింది. ప్రదీప్ కుమార్ తన శాఖకు సంబంధించి స్వయంగా పెట్టుబడుల కార్యకలపాలను నిర్వహిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో పరిమితులకు మించి చండీగఢ్‌లోని ఐడీఎఫ్‌సీ  ఫస్ట్ బ్యాంక్ సెక్టార్-32 బ్రాంచ్‌కు నిధుల బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయిఇ. 

►ALSO READ | సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఆఫర్ ! నలుగురు అరెస్టు

ఇక్కడ ట్విస్టేంటంటే.. పదవీ విరమణకు ముందు .. లాస్ట్ వర్కిండ్ డే నాడు అరెస్టయ్యారు. 2011 బ్యాచ్ హర్యానా సివిల్ సర్వీసెస్ (HCS) అధికారిగా ఉండి, ఆ తర్వాత ఐఏఎస్‌కు పదోన్నతి పొందిన ప్రదీప్ కుమార్, సభ్య కార్యదర్శిగా తన పదవీకాలంలో హెచ్‌ఎస్‌పిసిబి నిధుల గోల్ మాల్ వ్యవహారంలో  ప్రత్యక్ష పాత్ర పోషించారు.

ఎలాంటి శాఖాపరమైన అనుమతి లేకుండా హెచ్‌ఎస్‌పిసిబి పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి.. నిధులను మొదట బదిలీ చేసినట్లు సీబీఐ గుర్తించింది.  ఫిక్సుడు డిపాజిట్ల పేరుతో కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసినప్పటికీ.. ఆ అకౌంట్ లో  ఎలాంటి ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేకపోవడం అధికారులను షాకింగ్ కు గురిచేసింది. ఆ అకౌంట్ నుంచి రూ. 169 కోట్లను విత్ డ్రా చేసి.. అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పదేపదే నోటీసులు జారీ చేసినప్పటికీ కుమార్ విచారణను తప్పించుకుంటున్నారని, అలాగే పంచకులా కోర్టులో ముందస్తు బెయిల్ కు అప్లై చేశారని అధికారులు తెలిపారు.ఈ కేసులో  జూలై 2న విచారణ జరగాల్సి ఉందని.. ఈ క్రమంలో అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. 

హర్యానా ప్రభుత్వానికి చెందిన ఎనిమిది శాఖలకు సంబంధించిన రూ. 504 కోట్ల భారీ బ్యాంకింగ్ మోసం జరిగినట్లు ఆరోపణలున్నాయి.  అందులో హెచ్‌ఎస్‌పీసీబీ కేసు ఒక భాగం. ఈ మోసంలో ఫేక్  ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెబిట్ ట్రాన్జాక్షన్స్ ద్వారా ప్రజాధనాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. హర్యానా ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో నుంచి సీబీఐ ఈ దర్యాప్తును చేపట్టింది.