అమెరికాలో అరుదైన ఘటన.. ఒకే ఆసుపత్రిలో ఒకేసారి 17 మంది నర్సులు ప్రెగ్నెంట్ ! వరల్డ్ రికార్డ్..

అమెరికాలో అరుదైన ఘటన.. ఒకే ఆసుపత్రిలో ఒకేసారి 17 మంది నర్సులు ప్రెగ్నెంట్ ! వరల్డ్ రికార్డ్..

ఇది కదా అసలైన లక్ అంటే ! ఒకే ఆఫీస్‌లో ఇద్దరు ముగ్గురు ఒకేసారి ప్రెగ్నెంట్ అయితేనే అదో పెద్ద విశేషం అంటాం. అలాంటిది ఏకంగా 17 మంది నర్సులు ఒకేసారి గర్భవతులు అయ్యారు. వినడానికి ఏదో సినిమా స్టోరీలా ఉంది కదూ.. ? కానీ ఇది నిజంగానే జరిగింది. అమెరికాలోని ఓహియోలో ఉన్న మీయామి వ్యాలీ హాస్పిటల్ (Miami Valley Hospital) లో ఈ అరుదైన రికార్డ్ నమోదైంది.  

ఈ ఆసుపత్రిలోని లేబర్ అండ్ డెలివరీ విభాగంలో  పనిచేసే 17 మంది నర్సులు ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. వీరంతా 12 నుండి 35 వారాల గర్భంతో ఉన్నారు. ఈ అద్భుతమైన క్షణాన్ని గుర్తుంచుకోవడానికి వీరంతా కలిసి రీసెంట్‌గా ఒక గ్రూప్ ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. నిజానికి 2019లో ఇదే హాస్పిటల్‌లో 11 మంది నర్సులు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారట. ఇప్పుడు ఆ రికార్డును వీరు బ్రేక్ చేసారు. 

 నా బెస్ట్ ఫ్రెండే నా బిడ్డకు 
ఈ 17 మందిలో మ్యాడీ, రైలీ అనే ఇద్దరు నర్సులు ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ వారి రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... రైలీకి డెలివరీ టైమ్ వచ్చినప్పుడు, తన ప్రాణ స్నేహితురాలు మ్యాడీ చేతుల మీదుగానే కాన్పు జరగాలని కోరుకుంటోంది.

"మా హాస్పిటల్ స్టాఫ్ కంటే నాకు వేరే ఎవరి మీదా అంత నమ్మకం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ చేతుల మీదుగా నా బిడ్డ ఈ లోకంలోకి రావడం కంటే అదృష్టం ఏముంటుంది?" అని రైలీ మురిసిపోతోంది. ఈ నర్సులంతా వారి  పిల్లలని కూడా కలిసే పెంచాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

 హాస్పిటల్ పరిస్థితి ఏంటి?
ఒకేసారి 17 మంది నర్సులు ప్రసూతి సెలవుల (Maternity Leaves) మీద వెళ్తే హాస్పిటల్ ఎలా నడుస్తుంది..? సిబ్బంది కొరత రాదా..? అనే డౌట్ అందరికీ రావచ్చు. కానీ హాస్పిటల్ మేనేజర్ అంబర్లీ సానెర్ మాత్రం చాలా కూల్‌గా సమాధానం చెప్పారు.

ALSO READ : అమెరికా గడ్డపై పుట్టేనోళ్లందరికీ ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌గా పౌరసత్వం 

"మా వార్డులో దాదాపు 200 మంది నర్సులు, హెల్పర్స్ ఉన్నారు. షిఫ్టులు అడ్జస్ట్ చేయడానికి, అదనంగా పని చేయడానికి పార్ట్-టైమ్ స్టాఫ్ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి హాస్పిటల్ డ్యూటీలకి ఎలాంటి ఇబ్బంది రాదు. ఈ గుడ్ న్యూస్ మాకెంతో హ్యాపీగా, ఉత్సాహాన్ని ఇస్తోంది" అని ఆమె చెప్పారు. రోజూ వందల మంది తల్లులకి కాన్పులు చేసే నర్సులు.. ఇప్పుడు ఒకేసారి తల్లులు కాబోతుండటం నిజంగా ఒక బ్యూటిఫుల్ కో-ఇన్సిడెన్స్ కదూ!

మరిన్ని వార్తలు