ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి

ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి

పశ్చిమబెంగాల్ లో టీఎంసీ నేతలపై దాడుల పరంపర కొనసాగుతోంది.. గతంలో మమతాబెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీతో సహా పలువురి టీఎంసీ నేతలపై దాడులు జరగగా.. తాజాగా టీఎంసీ ఎంపీ మహువామొయిత్రాపై కోడిగుడ్లతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తన సొంత నియోజకవర్గం కృష్ణానగర్ లో  ఓ రెస్టారెంట్ దగ్గర ఆమెపై కొందరు వ్యక్తులు గుడ్లు విసిరారని మహువా మొయిత్రా తెలిపారు. 

స్థానిక టీఎంసీ నేతలు, కార్యకర్తలతో ఓ రెస్టారెంట్ ముందు సమావేశం అయిన సమయంలోతనపై దాడి జరిగిందని.. రెస్టారెంట్ లోంచి కోడిగుడ్లు విసిరారని మహువా మొయిత్రా ఆరోపించారు. దాడికి సంబంధించిన వీడియోలను  సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది బీజేపీ నేతలపై పనే అని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర పోలీసులు చూస్తుండగానే బీజేపీ ఈ దాడి చేసిందని ఆరోపించారు.

టీఎంసీ నాయకులపై గుడ్ల దాడి

మే నెలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలైన తర్వాత, ఆ పార్టీ నాయకులపై జరిగిన ఇలాంటి దాడుల జరుగుతూనే ఉన్నాయి.తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. జూన్ 7 మీడ్నాపూర్లో టీఎంసీ నేత సుజోయ్ హజ్రాప స్థానికులు గుడ్లువిసిరారు.అదేరోజు  కోల్‌కతా కౌన్సిలర్లు బప్పాదిత్య దాస్‌గుప్తా, మహ్మద్ జసిముద్దీన్‌లపై కూడా గుడ్లు విసిరారు. జూన్ 18న టీఎంసీ మాజీ మాంత్రిఉదయన్ గుహాను కూడా ఇదే విధంగా లక్ష్యంగా చేసుకున్నారు. జూన్ 19న అసన్‌సోల్ కోర్టు ప్రాంగణంలో టీఎంసీకి చెందిన మరో  నేత విజయ్ సింగ్‌పై గుడ్లు విసిరారు.

ALSO READ : సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర.. 

పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ24 పరగణాల జిల్లాలోనిసోనార్ పూర్ లో టీఎంసీ జాతీయ ప్రధానకార్యదర్శి అభిషేక్ బెనర్జీపై మే30న దాడి చేశారు గుర్తు తెలియనివ్యక్తులు. నిరసనకారులు బెనర్జీ కాన్వాయ్‌పై గుడ్లు, రాళ్లు, బూట్లు, చెప్పులు విసిరారు. గుడ్ల దాడికి గురైన తర్వాత ఆయన రక్షణ హెల్మెట్ ధరించి ఉండగా, భద్రతా సిబ్బంది ఆయనను అక్కడి నుంచి తీసుకువెళ్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘర్షణలో ఆయన చొక్కా చిరిగిపోయిందని, కళ్లజోడు దెబ్బతిన్నది. తాజా ఘటనతో టీఎంసీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.