T20 World Cup: T20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన హై-ప్రెజర్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టీమ్ కి మంచి ఆరంభం లభించింది. కివీస్ ఆల్ రౌండర్ కోల్ మెక్‌కాంచీ దెబ్బకు ప్రోటీస్ జట్టు ఆదిలోనే కీలకమైన రెండు వికెట్లను కోల్పోయింది. మెక్‌కాంచీ వేసిన రెండో ఓవర్‌లోనే క్వింటన్ డి కాక్ , ర్యాన్ రికెల్టన్ వికెట్లను పడగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా 9 ఓవర్లు ముగిసే సమయానికి 67/3 స్కోరు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్ క్రీజులో ఉన్నారు.
అయితే లాకీ ఫెర్గూసన్ వేసిన అద్భుతమైన ఓవర్లో ప్రోటీస్ కెప్టెన్ మార్క్రమ్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మార్క్రామ్ ఇచ్చిన క్యాచ్ ని మిడ్ వికెట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర వదిలేశాడు. దీంతో ఆ తర్వాత బంతినే ఐడెన్ బౌండరీగా మలిచాడు. ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. కాగా 8 ఓవర్ లో బౌలింగ్ కి వచ్చిన రచిన్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు యత్నించిన మార్క్రామ్ లాంగాన్ లో ఉన్న డారిల్ మిచెల్ అద్భుతమైన క్యాచ్ ని ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్ ని కాసేపు పరిశీలించిన థర్డ్ అంపైర్ తర్వాత ఔట్ గా ప్రకటించాడు. అనంతరం క్రీజులోకి డేవిడ్ మిల్లర్ ఎక్కువ సేపు మైదానంలో నిలవలేకపోయాడు.
ఇరు జట్లు
న్యూజిలాండ్:
ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్‌కోన్చీ, మాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్.
సౌతాఫ్రికా:
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కోర్బిన్ బాష్, కాగిసో రబడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి.
