T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఐడెన్ మార్క్రామ్ నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. టాస్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. ఇక్కడి పిచ్ పరిస్థితులు బౌలింగ్‌కు సహకరిస్తాయని భావిస్తున్నాం.. సౌతాఫ్రికా బలమైన జట్టు, వారిని ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించడంపైనే మేము దృష్టి పెట్టాం.. జట్టులో రెండు మార్పులు చేశాం.. మాట్ హెన్రీ, నీషమ్ తిరిగి జట్టులోకి రావడం మాకు కలిసొచ్చే అంశమని శాంట్నర్ తెలిపారు.
దక్షిణాఫ్రికా సారథి ఐడెన్ మార్క్రామ్ మాట్లాడుతూ.. జట్టులో ప్రతి ఒక్కరూ సహకారం అందించడం సంతోషంగా ఉంది.. బ్యాటింగ్‌తో శుభారంభం చేసి మంచి స్కోరు సాధిస్తాం.. ఈరోజు బ్యాటింగ్‌లో మంచి ఆరంభం చేసి బోర్డుపై పోటీ స్కోరు పెట్టాలని భావిస్తున్నాం.. నాకౌట్ మ్యాచ్‌లో ముందుగా పరుగులు చేయడం తప్పు కాదన్నారు. మా జట్టులో మూడు మార్పులు చేశాం.. రబడ, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్ తిరిగి జట్టులోకి వచ్చారని తెలిపారు.
న్యూజిలాండ్:
ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్‌కోన్చీ, మాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్.
సౌతాఫ్రికా:
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కోర్బిన్ బాష్, కాగిసో రబడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి
