Manchu Manoj: మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి.. ఫ్యామిలీ గొడవలపై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

Manchu Manoj: మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి.. ఫ్యామిలీ గొడవలపై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రూటే సపరేటు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటుందో.. రియల్ లైఫ్‌లో మాట్లాడే విధానం కూడా అంతే బోల్డ్ అండ్ క్రేజీగా ఉంటుంది. మే 20న తన పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి..

గత కొంతకాలంగా మంచు కుటుంబంలో జరుగుతున్న అంతర్గత విభేదాలు, ఆస్తి గొడవలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ విలేకరి  మీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు క్లియర్ అయినట్టేనా?" అని అడగ్గా.. మనోజ్ ఏమాత్రం తడుముకోకుండా, తనదైన శైలిలో నవ్వుతూ పంచ్ వేశారు. ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీ అందరికీ బాగా తెలుసు… వెళ్లి ఆయన్నే అడగండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి.. మైక్ పట్టుకుని కాదు, తలకు హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఈ హెల్మెట్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

 

మౌనిక రెడ్డి పొలిటికల్ ఎంట్రీ 

మరోవైపు, తన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న వార్తలను మనోజ్ అధికారికంగా ధ్రువీకరించారు. రాయలసీమ రాజకీయాల్లో భూమా కుటుంబానికి ఉన్న ప్రత్యేక క్రేజ్ గురించి తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మౌనిక ఖచ్చితంగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తాము ఇప్పటికే పరోక్షంగా రాజకీయాల్లో భాగమయ్యామని, ఆమె పొలిటికల్ ఎంట్రీపై ఉన్న ఉత్కంఠకు తెరదించారు.

 

సొంత నిధులతో సేవా సంస్థ..

సమాజంలో మార్పు కోసం, అణచివేతకు గురవుతున్న వారి గొంతుకగా నిలబడేందుకు తాను ఇటీవల ‘ఐక్య ధైర్యసేన సమితి’ (AIKYA) ప్రారంభించినట్లు మనోజ్ వెల్లడించారు. ఇది కేవలం ఒక సేవా సంస్థ మాత్రమేనని, దీనికి ఎలాంటి రాజకీయ రంగు లేదని స్పష్టం చేశారు. ఈ సంస్థ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టే సేవా కార్యక్రమాలకు తన సొంత నిధులనే వెచ్చించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మనోజ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

►ALSO READ | ఫ్యాన్స్‌పై బాడీగార్డ్ ఓవరాక్షన్.. చేతులు జోడించి సారీ చెప్పిన స్టార్ హీరో !