ఫ్యాన్స్‌పై బాడీగార్డ్ ఓవరాక్షన్.. చేతులు జోడించి సారీ చెప్పిన స్టార్ హీరో !

ఫ్యాన్స్‌పై బాడీగార్డ్ ఓవరాక్షన్.. చేతులు జోడించి సారీ చెప్పిన స్టార్ హీరో !

సినీ స్టార్స్ కు ఉన్న  క్రేజ్ వేరు. వాళ్లు రోడ్డుపైకి వస్తే చాలు, ఫ్యాన్స్ గుంపులు గుంపులుగా ఎగబడతారు. లేటెస్ట్ గా బాలీవుడ్ కామెడీ కింగ్ గోవిందాకు ముంబైలో సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే, అక్కడ జరిగిన ఒక చిన్న రచ్చ, ఆ తర్వాత గోవిందా రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

బాడీగార్డ్స్ ఓవరాక్షన్..

ముంబైలో జరిగిన 'మిసెస్ ఇండియా క్వీన్ పెహచాన్ మేరీ సీజన్ 4' గ్రాండ్ ఫినాలేకు గోవిందా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్ ముగించుకుని ఆయన బయటకు రాగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆయనపైకి దూసుకొచ్చారు. ఆ తోపులాటలో గోవిందా బాడీగార్డ్స్ కాస్త ఓవరాక్షన్ చేశారు. జనాన్ని కంట్రోల్ చేసే ప్రాసెస్‌లో ఒక అభిమానిని, మీడియా ప్రతినిధిని గట్టిగా నెట్టేశారు. 

 

ప్లీజ్ వదిలేయండి... కూల్..

దీంతో నన్ను ఎందుకు నెడుతున్నారు? అంటూ అక్కడున్న వారు బాడీగార్డ్‌పై ఫైర్ అయ్యారు. క్షణాల్లో వాతావరణం వేడెక్కింది. సీన్ కట్ చేస్తే... మన రియల్ హీరో ఎంట్రీ ఇచ్చారు. తన బాడీగార్డ్ తప్పును కప్పిపుచ్చుకోకుండా, గోవిందా వెంటనే చేతులు జోడించి, చాలా వినయంగా .. సార్, ప్లీజ్ వదిలేయండి... కూల్ అవ్వండి అంటూ అభిమానులకు సర్దిచెప్పారు. తన సెక్యూరిటీని కూడా వారించి, అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నువ్వు నిజంగానే హీరో నంబర్ 1 భయ్యా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

►ALSO READ | 40 ఏళ్ల క్రితమే సొంత విమానం, ఓడలు.. సౌత్ ఇండియాలోనే తొలి ప్రైవేట్ జెట్ ఉన్న స్టార్ హీరోయిన్ ఈమె!

గతంలోనూ...

గతంలో అక్షయ్ కుమార్ బాడీగార్డ్ ఎయిర్‌పోర్టులో ఒక అభిమానిని కొట్టడం, సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ బొకే ఇవ్వబోయిన ఫ్యాన్‌ను తోసేయడం, కింగ్ నాగార్జున బాడీగార్డ్ ఒక వికలాంగ అభిమానిని పక్కకు నెట్టేయడం లాంటి ఘటనలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కానీ, ఆ స్టార్స్ లాగా ఇగ్నోర్ చేయకుండా గోవిందా స్వయంగా క్షమాపణలు చెప్పడంతో ఫ్యాన్స్ చేత గ్రేట్ అనిపించుకున్నారు.  ప్రస్తుతం గోవిందా తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం క్రేజీ స్క్రిప్ట్‌లు వింటున్నారు. ఆయన త్వరలోనే సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్‌తో కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.