
మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’పై భారీ అంచనాలున్నాయి. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ‘కన్నప్ప’ చిత్రాన్ని రూపొందించారు.
జూన్ 27 విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచారు మేకర్స్. ఇటీవలే పాటలు, ప్రీ రిలీజ్ ఈవెంట్, విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇలా అదిరిపోయే అప్డేట్స్ ఇస్తూ కన్నప్పను ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా హీరో విష్ణు ఇంటర్వ్యూస్ ఇస్తూ.. ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కన్నప్ప ఓటీటీ డీల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
'కన్నప్ప' ఓటీటీ డీల్ కుదిరిందా? అని ప్రశ్న ఎదురవ్వగా.. 'ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వాళ్ళు ఓ ఫిగర్ చెప్పారు. కానీ అది నాకు నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. డబ్బులు రెడీ చేస్కోండి. విడుదలయ్యాక వస్తానని' చెప్పినట్లు విష్ణు తెలిపాడు.
అంతేకాకుండా.. "కన్నప్పను నా శైలిలో అమ్మడానికి నాకు నా స్వంత మార్కెటింగ్ వ్యూహం ఉంది, ఓటీటీ వారి నియమాలను పాటించడం ద్వారా కాదు. వారు అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు, వారి నిబంధనలు చెల్లుబాటు అవుతాయి, కానీ నేను నా సినిమాను ముందుగానే చూపించలేను" అని కూడా విష్ణు ప్రకటించారు.
ఈ స్టేట్ మెంట్‌తో కన్నప్ప సినిమాపై ఉన్న విష్ణు కాన్ఫిడెన్స్.. అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే, ముందు ముందు రాబోతున్న సినిమాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఇపుడు విష్ణు డెసిషన్ వల్ల మొదట్లో ఈ సినిమాను ట్రోల్ చేసిన నెటిజన్స్ సైతం అవాక్కవుతున్నారు.
అందుకు కారణం లేకపోలేదు.. ప్రస్తుత రోజుల్లో సినిమా స్టార్ట్ అయ్యిన వెంటనే.. OTT ఒప్పందాలు జరుగుతున్న రోజులివి. అలాంటిది ఇంకా కన్నప్ప మూవీకి ఓటీటీ డీల్ కంప్లీట్ అవ్వకపోవడం చూస్తుంటే.. విష్ణు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
స్ట్రీమింగ్ హక్కులను ముందుగానే ఖరారు చేసే చాలా పెద్ద బడ్జెట్ చిత్రాల మాదిరిగా కాకుండా, సినిమా డిజిటల్ విడుదల విషయంలో విష్ణు ధైర్యంగా ఉన్నాడని మంచు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చూస్తుంటే సినిమాపై చాలా నమ్మకంతోనే ఉన్నాడనిపిస్తుంది. ఒకవేళ సినిమా రిజల్ట్‌లో ఏదైనా తేడా వస్తే.. విష్ణు పరిస్థితపై కూడా చర్చ నడుస్తోంది. చూడాలి మరి ఫలితం ఎలా వస్తుందో?
From vision to sacrifice to silver screen. Vishnu Manchu opens up about the soul behind #Kannappa🏹.
— Kannappa The Movie (@kannappamovie) June 3, 2025
📽 Don't miss this heartfelt video#MyKannappaStory #VishnuManchu#harharmahadevॐ #Kannappa27thJune #KannappaMovie2025 #KannappaTeluguMovie #Prabhas #Mohanlal #MohanBabu… pic.twitter.com/3TxnYfbTCV
ఇందులో శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రలో విష్ణు నటించాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కూడా విష్ణునే కావడం విశేషం. దానికితోడు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ నటిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. సుమారు రూ.100కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నప్ప సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మించారు.