స్టార్ కొరియోగ్రాఫర్ డైరెక్షన్లో మంచు విష్ణు నెక్స్ట్ మూవీ.. ?

స్టార్ కొరియోగ్రాఫర్ డైరెక్షన్లో మంచు విష్ణు నెక్స్ట్ మూవీ.. ?

ఇటీవల విడుదలైన కన్నప్ప సినిమాతో హిట్ అందుకున్నారు మంచు విష్ణు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తన డ్రీం ప్రాజెక్ట్ గా ఈ సినిమాను నిర్మించిన విష్ణు వరుస ప్లాప్స్ తర్వాత హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కన్నప్ప సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మంచు విష్ణు నెక్స్ట్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. అదేంటంటే.. విష్ణు నెక్స్ట్ మూవీ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్షన్ లో రానుందని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం కన్నప్ప సక్సెస్ హ్యాంగోవర్ లో ఉన్న మంచు విష్ణు కొంత గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాను స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. తాను త్వరలోనే ఒక పక్కా కమర్షియల్ సినిమా చేననున్నట్లు ఇదివరకే వెల్లడించారు విష్ణు. ఈ సినిమాకు స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్షన్ లో రానుందని టాక్ వినిపిస్తోంది. మరి, వినిపిస్తున్న వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. కన్నప్ప లాంటి హిట్ అందుకున్న తర్వాత మంచు విష్ణు చేయనున్న సినిమాపై మాత్ర అందరిలో ఆసక్తి నెలకొంది.

ALSO READ | Alcohol: ఇంట్రస్టింగ్ గా అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్..

జూన్ 27న విడుదలైన కన్నప్ప సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని విష్ణు కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది.3 రోజులకు గాను సుమారు రూ. 40.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. వీకెండ్ వరకు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా ఇకపై అదే ఊపు కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది చూడాలి.