అయ్యో మన్నారా.. బిగ్​బాస్​కి వెళ్లినా వీడని ముద్దు వివాదం

అయ్యో మన్నారా.. బిగ్​బాస్​కి వెళ్లినా వీడని ముద్దు వివాదం

టాలీవుడ్​ హీరోయిన్​ మన్నారా చోప్రా(Mannara Chopra)ను దర్శకుడు రవికుమార్​ ముద్దు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నటి ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. డైరెక్టర్​ రవికుమార్​ తనకు తండ్రిలాంటి వారని చెప్పింది.

తాజాగా మన్నారా హిందీ బిగ్​బాస్​లోకి కంటెస్టెంట్​గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, అక్కడ కూడా ఈ వివాదం ఈ బ్యూటీ మెడకు చుట్టుకుంది. దీంతో మరోసారి దీనిపై ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చింది. తిరగబడరా సామి సినిమా ప్రమోషన్స్‌ ఊహించని మలుపు తిరుగుతుందని నేను అనుకోలేదు.

ఇప్పటికే దీని గురించి చాలా సార్లు చెప్పాను. ఆయనకు నేను చిన్న పిల్లతో సమానం. అందుకే అలా ముద్దు పెట్టారు. దీని గురించి ఇంతకంటే మాట్లాడడానికి సిద్ధంగా లేను’ అని మన్నారా రిప్లై ఇచ్చింది. 

Also Read :- విజయ్ లియో మూవీకి ఊహించని షాక్‌

రీసెంట్ గా రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన తిరగబడరా సామి టీజర్ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ ఎ.ఎస్ రవికుమార్..హీరోయిన్ మన్నారచోప్రా భుజంపై చెయ్యేసి ముద్దు పెట్టుకున్నారు. హీరోయిన్ మన్నారచోప్రా స్మైల్ ఇస్తూ రియాక్ట్ అవ్వగా.. ఆడియన్స్ మాత్రం డైరెక్టర్ పై భిన్నమైన కామెంట్స్ చేయగా..ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.