విజయ్ లియో మూవీకి ఊహించని షాక్‌..తెలుగు విడుదలపై కోర్టు స్టే!

విజయ్ లియో మూవీకి ఊహించని షాక్‌..తెలుగు విడుదలపై కోర్టు స్టే!

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay thalapathy) టైటిల్ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లియో(Leo). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. దానికి దగ్గట్టుగానే సాంగ్స్, ట్రైలర్ ఉండటంతో ఏ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు

లేటెస్ట్ గా తెలుగులో లియో మూవీని..ఈ నెల అక్టోబర్ 20వ తేదీ వరకు రిలీజ్ చేయకూడదని ఇవాళ (అక్టోబర్ 17న) హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు ఆదేశించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. తెలుగు లియో టైటిల్‌ను ఉపయోగించడంపై..అడ్వొకేట్​ కే. నరసింహా రెడ్డి వేసిన పిటిషన్​ మేరకు లియో సినిమా విడుదలపై స్టే ఇస్తూ నోటీసులు పంపింది.

Also Read :- జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు అందుకున్న అల్లు అర్జున్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌(Sithara Entertainment)కు చెందిన నిర్మాత నాగ వంశీ( Naga Vamsi)  ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. లియో మూవీ తెలుగు మినహా..ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 19న విడుదలకు సిద్ధమైంది. 

లియో సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్స్ గా కనిపిస్తున్నారు. లలిత్ కుమార్, జగదీశ్ పళనిసామి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.