హార్ముజ్ జలసంధిలో దోమల దండు.. అమెరికా చమురు నౌకలను పేల్చేస్తున్నాయ్!

హార్ముజ్ జలసంధిలో దోమల దండు.. అమెరికా చమురు నౌకలను పేల్చేస్తున్నాయ్!
  • రెప్పపాటులో యాక్షన్ లోకి ఇరాన్ మస్కిటో ఫ్లీట్స్ 
  • చమురు రవాణా మార్గాలపై పహారా 
  • ఎంతటి పెద్ద యుద్ధనౌకలనైనా క్షణాల్లో ధ్వంసం 
  • నీటి లోపల కూడా శత్రువులను దెబ్బతీసే టెక్నాలజీ

ప్రపంచాన్ని శాసించేందుకు ఇరాన్ వద్ద ఉన్న ఏకైన ఆయుధం హార్మూజ్ జలసంధి. ఇదే ఇప్పుడు అందరినీ అతలాకుతలం చేస్తున్నది. ప్రపంచానికి చమురు వదలకుండా నిరంతరం పహారా కాస్తోంది దోమలదండు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, గల్ఫ్ జలాల్లో ఇరాన్ తన అత్యంత ప్రమాదకరమైన మస్కిటోఫ్లీట్ ను రంగంలోకి దింపింది. 

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కి చెందిన వందలాది చిన్న తరహా వేగవంతమైన అటాక్ బోట్లు ఇప్పుడు అంత ర్జాతీయ చమురు రవాణా మార్గాల్లో పహారా కాస్తున్నాయి. ఈ చిన్న బోట్లు చూడటానికి సా ధారణంగా ఉన్నప్పటికీ, వీటిలో నస్, కౌసర్, ఘదర్, జాఫర్, అబు మహదీ వంటి శక్తివంత మైన క్షిపణులను అమర్చారు. ఇవి ఎంతటి పెద్ద యుద్ధనౌకలనైనా క్షణాల్లో నాశనం చేయగలవు. 

సముద్ర ఉపరితలంపైనే కాకుండా, నీటి లోపల కూడా శత్రువును దెబ్బతీసేందుకు ఇరాన్ తన మినిసబ్మెరైన్లను సైతం హర్మూర్ లో ఏర్పాటు చేసింది. ఇవి రాడార్లకు చిక్కకుండా శత్రు నౌకల సమీపంలోకి వెళ్లి మెరుపు దాడి చేయగలవు. శత్రు విమానాలు, నౌకలు దాడికి ప్రయత్నిస్తే తీరం నుంచే క్షిపణుల వర్షం కురిపించేలా ఇరాన్ వ్యూహరచన చేసింది. "మస్కిటో ఫ్లీట్"గా పిలిచే ఈ చిన్న పడవలదే కీలకపాత్ర. దాదాపు 10 టన్నుల బరువుతో ఉండే ఈ రకం ఫాస్ట్ బోట్స్ 1,500 వరకు ఇరాన్ ఐఆర్ జీసీ నేవీ వద్ద ఉన్నాయి.

టెహ్రాన్ కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని సంబరపడుతున్న అమెరికాకు ఇవి షాకిస్తున్నాయి. ఇటువంటివి 300 వరకు ఉన్నట్లు అంచనా. ఈ పడవలు కేవలం 50 లేదా 110 నాట్స్ వేగంతో ప్రయాణించ గలవు. సముద్రంపై చురుగ్గా కదలగలవు. గుంపుగా ఈ చిన్నబోట్లు దాడి చేస్తే.. భారీ యుద్ధ నౌకల టార్గెటింగ్ వ్యవస్థలు కూడా సమస్యలను ఎదుర్కొంటాయి. కొన్నాళ్ల క్రితం హర్మూజ్లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో 40 బోట్లు పాల్గొన్నాయి. వాస్తవానికి ఈ జలసంధి ఇరుగ్గా ఉండటంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్లే అవకా శాలు లేవు. ఇదే ఈ దోమలదండుకు కలిసి వస్తున్న అంశం.

రెండు చోట్ల ఇవే దాడి చేశాయా?

ఇటీవల జనవరిలో ఐఆర్ జీసీ విడుదల చేసిన వీడియోలో ఓ భూగర్భ స్థావరంలో పెద్ద సంఖ్యలో ఈ డ్రన్బోట్లు ఉన్నాయి. ఇరాన్ దళాలకు అనుబంధంగా పనిచేసే హూతీలు ఇప్పటికే డ్రోన్ బోట్లను వినియోగించారు. చిన్న ఫైబర్ గ్లాస్ లేదా చెక్క పడవలను మానవ రహిత బోట్లుగా తీర్చిద్దారు. ఇప్పటికే కువైట్ వద్ద సోనాంగ్ నమిబే, ఇరాక్ సమీపంలో సేఫ్సీ విష్ణు, జెఫీరోస్ ట్యాంకర్లపై వీటిని ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు.

ఇరాన్ అమ్ముల పొదిలో మరో సైలెంట్ కిల్లర్

ఇక ఇరాన్ దళాల వద్ద అజదార్ అనే మానవ రహిత అండర్ వాటర్ వెహికల్ కూడా ఉంది. ఇది నాలుగు రోజులపాటు 600 కిలోమీటర్ల రేంజిలో గస్తీ కాయగలదు. అవసరమైతే నౌకలపై దాడి కూడా చేస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్గా వ్యవహరిస్తారు.