ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ HJ దొర కన్నుమూత..

ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ HJ దొర కన్నుమూత..

ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ HJ దొర కన్నుమూశారు. శుక్రవారం ( మార్చి 13 ) తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శుక్రవారం మధ్యాహ్నం నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో HJ దొర సన్నిహితులు, పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

దొర ఉమ్మడి ఏపీలో మావోయిస్టు ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న రోజుల్లో డీజీపీగా పనిచేశారు. గ్రేహౌండ్స్ దళాన్ని బలోపేతం చేయడం, నక్సలిజంపై వ్యూహాత్మక పట్టు సాధించడంలో కీలక పాత్ర పోషించారు దొర. 

ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ లో సాంకేతికత ప్రవేశపెట్టడం, కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి సంస్కరణలకు నాంది పలికారు దొర. ఉమ్మడి రాష్ట్రంలో ఐదున్నరేళ్ళకు పైగా డీజీపీగా పనిచేశారు దొర.