ఈ శుక్రవారం (2026 మార్చి 13న) థియేటర్లలో కొత్త సినిమాల ఊసే లేదు. గత వారం 8 చిన్న సినిమాలు పోటాపోటీగా వచ్చి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అసలు, ఈ వారం అయితే చిన్న మరియు పెద్ద సినిమాల ఊసే లేదు. థియేటర్లు కొత్త సినిమాలు లేక బోసిపోయాయి. ఒకేసారి అన్నీ గుంపులు గుంపులుగా పోటీపడటం కంటే, ఇలా ఖాళీ సమయాన్ని వాడుకోవడం సినిమాల భవిష్యత్తుకు, బాక్సాఫీస్ కు కూడా మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మాత్రం అస్సలు వెనక్కీ తగ్గకుండా ప్రతివారం కొత్త సినిమాలను తీసుకొస్తూనే ఉన్నాయి. ఇవాళ శుక్రవారం ఏకంగా మూడు తెలుగు కొత్త సినిమాలు ఓటీటీలో దర్శనం ఇచ్చాయి. ఇపుడు ఈ సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాయి. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ జోనర్లలోని వచ్చిన ఆ క్రేజీ సినిమాలు ఏంటి? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో లుక్కేద్దాం..
కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ:
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ మూవీ 'కపుల్ ఫ్రెండ్లీ' . అశ్విన్ చంద్రశేకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటి యువత ఎదుర్కొనే నిజమైన సవాళ్లను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ అశ్విన్.
ఒక ప్రేమకథగానే కాకుండా ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది
కథ:
ఈ మూవీలో శివ (సంతోష్ శోభన్) మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. కెరీర్ పట్ల సందిగ్ధత, ఆర్థిక ఇబ్బందులు, ఆందోళనతో ఉన్న యువకుడిగా సంతోష్ శోభన్ తన నటనకు ప్రాణం పోశాడు. శివ ఇంటీరియల్ డిజైనర్ కావాడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాత్రలో ఆకట్టుంటాడు.
ఇక మానస వారణాసి పోషించిన మిత్ర పాత్ర ఈ సినిమాకు ఆత్మ వంటిది. ఆమె కేవలం హీరో వెనుక తిరిగే పాత్ర కాదు. తన సొంతంగా సమస్యలను పరిష్కరించుకుంటూ, ఆఫీసు రాజకీయాలను తట్టుకుంటూ నిలబడే గట్టి అమ్మాయి. మిత్ర పాత్రలో మానస ఎంతో సహజంగా ఒదిగిపోయారు. అనుకొని పరిస్థితుల ద్వారా శివ, మిత్ర కలుస్తారు. చివరికి ఒకే గదిని పంచుకుంటారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురురించి.. లివింగ్ రిలేషన్‌ని కొనసాగిస్తారు. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వీరిద్దరి జీవితంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది. అదేంటి? శివ, మిత్ర ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. మిత్ర రాకతో శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరకు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే కథ.
Shiva and Mithra are now in your homes ✨#CoupleFriendly now streaming on @PrimeVideoIN ❤️@santoshsoban @varanasi_manasa @manojac #AjayKumarRaju @DKP_DOP @thecutsmaker #Micheal_ArtDirector @d369_reddy @dineshmoffl @gopiprasannaa #PrasathColorist @dinzhdina @Sethu_Cine pic.twitter.com/fmRUxSjw3z
— UVConcepts (@UVConcepts_) March 13, 2026
భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ:
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. సాంగ్స్, ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో హీట్ పెంచినప్పటికీ, థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
అయినప్పటికీ.. రవితేజ కామెడీ టైమింగ్, ఇద్దరు హీరోయిన్ల మధ్య మాస్ రాజా రొమాన్స్‌ను చూడాలని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇక ఎట్టకేలకు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ:
రామ్ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్ కంపెనీ యజమాని. తన భార్య బాలమణి (డింపుల్ హయాతి)తో సంతోషంగా జీవిస్తుంటాడు. బిజినెస్ పనితో స్పెయిన్ వెళ్లిన రామ్ అక్కడ మానస శెట్టి (ఆశికా రంగనాథ్)ను కలుస్తాడు. తన అసలు పేరు చెప్పకుండా “సత్య”గా పరిచయం అవుతాడు. వారి మధ్య స్నేహం పెరిగి అనుకోని తప్పుకు దారి తీస్తుంది. ఆ సంఘటన తర్వాత రామ్ జీవితం గందరగోళంగా మారుతుంది. ఒక వైపు భార్య, మరో వైపు మానస మధ్య చిక్కుకున్న అతను ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ.
The MASS is here!
— ZEE5 Telugu (@ZEE5Telugu) March 12, 2026
The COMEDY ENTERTAINER is here!!#BharthaMahasayulakuWignyapthi
STREAMING NOW#RaviTeja #DimpleHayathi #AshikaRanganath pic.twitter.com/QZV1QbPXHj
‘ఫంకీ’ ఓటీటీ:
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘ఫంకీ’ (Funky). కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. డైరెక్టర్ అనుదీప్ కేవీ ఈ సినిమాను తెరకెక్కించాడు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్గా వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రిలీజైన ఈ రొమాంటిక్ కామెడీ.. ఇవాళ నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది.
‘ఫంకీ’ కథ:
కోమల్ ((విశ్వక్ సేన్)) ఒక యంగ్ డైరెక్టర్. నిర్మాత సుదర్శన్ (నరేష్) దగ్గర 4 కోట్ల బడ్జెట్‌తో సినిమా మొదలు పెడతాడు. కానీ అతని వల్ల బడ్జెట్ 40 కోట్లకు పెరుగుతుంది. అలా బడ్జెట్ తడిసి మోపెడవ్వడంతో టెన్షన్ తట్టుకోలేక నిర్మాత సుదర్శన్ ఆసుపత్రి పాలవుతాడు.
అప్పుడు సుదర్శన్ కూతురు చిత్ర (కయాదు లోహర్) వచ్చి కోమల్‌ను తీసేయాలని నిర్ణయిస్తుంది. కానీ కోమల్ కేవలం 1 కోటి రూపాయలతో సినిమా పూర్తి చేస్తానని ఆమెను ఒప్పిస్తాడు.
ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ కూడా మొదలవుతుంది. ఇక జి.కె. (సంపత్ రాజ్) కథలోకి వచ్చి సమస్యలను పెంచుతాడు. చివరికి కోమల్ సినిమా ఎలా పూర్తి చేశాడు, సమస్యలు ఎలా పరిష్కరించాడు అన్నదే మిగతా కథ.
Get in! We’re watching an agmark Anudeep KV laughter ride 😍❤️ pic.twitter.com/KHUifyTnW1
— Netflix India South (@Netflix_INSouth) March 13, 2026
