OTT Horror: ఓటీటీలోకి రూ.550 కోట్ల హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించే ఆత్మల కథ

OTT Horror: ఓటీటీలోకి రూ.550 కోట్ల హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించే ఆత్మల కథ

హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చీకటి వాతావరణం, ఊహించని ట్విస్టులు, భయపెట్టే సన్నివేశాలు, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసే ఈ జానర్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్లలో భయపెట్టిన ఎన్నో హారర్ చిత్రాలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల కాలంలో హారర్ జానర్‌లో వచ్చిన సినిమాలు కేవలం భయపెట్టడమే కాకుండా, మిస్టరీ, సస్పెన్స్, ఎమోషన్‌ను కూడా కలిపి కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ హారర్ ఫ్రాంచైజీలు, సైకలాజికల్ థ్రిల్లర్స్, సూపర్‌నేచురల్ కథలు OTT ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అదే ‘ఈవిల్ డెడ్ బర్న్’ (Evil Dead Burn).

‘ఈవిల్ డెడ్ బర్న్’ ఓటీటీ..

మోస్ట్ ఫేమస్ హారర్ ఫ్రాంచైజీ ‘ఈవిల్ డెడ్’ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఈవిల్ డెడ్ బర్న్’. ఈ ఇంట్రెస్టింగ్ హార్రర్  థ్రిల్లర్ మరికొన్ని గంటల్లో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రానుంది. ఆగస్టు 4 నుంచి వార్నర్ బ్రదర్స్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో PVOD (Premium Video On Demand) విధానంలో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. (అంటే.. ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త సినిమాలను థియేటర్ విడుదల సమయంలోనే లేదా వెంటనే ప్రత్యేక రుసుము చెల్లించి ముందుగా చూసే PVOD Streaming విధానం)

ఈ సినిమాను ప్రేక్షకులు ఆపిల్ టీవీ (Apple TV), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యూట్యూబ్ మూవీస్ (YouTube Movies) ద్వారా రెంటల్ లేదా కొనుగోలు పద్ధతిలో చూడొచ్చు. అంతేకాకుండా, సెప్టెంబర్ 22 నుంచి 4K అల్ట్రా హెచ్‌డీ, బ్లూ-రే, డీవీడీ ఫిజికల్ కాపీలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

‘ఈవిల్ డెడ్ బర్న్’ కథ:

ఈ చిత్రం ఆలిస్ (సుహైలా యాకూబ్) అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. భర్త మరణం తర్వాత అతని కుటుంబాన్ని కలిసేందుకు ఓ దూర ప్రాంతంలోని పాత బంగ్లాకు వెళ్లిన ఆలిస్‌కు అక్కడ ఊహించని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఆ ఇంట్లో విల్ తాత గతంలో ‘బుక్ ఆఫ్ ది డెడ్’ (నెక్రోనామికన్) అనే దుష్ట శక్తి పుస్తకంపై పరిశోధనలు చేసి ఉంటాడు. ఆ పుస్తకం కారణంగా వెలువడిన రాక్షస శక్తులు, ఇంట్లో ఉన్నవారందరినీ ‘డెడైట్స్‌’ (రాక్షసులుగా) మార్చేస్తాయి. ఆ దుష్ట శక్తుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆలిస్, తోటివారితో కలిసి భయానక వాతావరణంలో ఎలా పోరాడారు? చివరికి ఆ గండం నుంచి ఎలా బయటపడ్డారన్నదే ఈ మూవీ అసలు కథ.

ఎలా ఉందంటే:

'బుక్ ఆఫ్ ది డెడ్' (నెక్రోనామికన్ పుస్తకం వల్ల భయంకరమైన సంఘటనలు మొదలవుతాయి. ఆ పుస్తకంలో ఉన్న దుష్ట శక్తులు మేల్కొన్న తర్వాత, అక్కడికి వచ్చిన కొంతమంది యువకుల జీవితం పూర్తిగా మారిపోతుంది. ప్రారంభంలో సాధారణంగా కనిపించే ఆ ఇల్లు, లోపల దాచుకున్న చీకటి గతాన్ని బయటపెడుతుంది. అనుకోకుండా ఆ పురాతన శక్తిని విడుదల చేసిన తర్వాత, ఒక్కొక్కరిగా వారు భయంకరమైన అనుభవాలను ఎదుర్కొంటారు. 

తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వారు ఆ దుష్ట శక్తితో పోరాడాల్సి వస్తుంది. కానీ అసలు సమస్య కేవలం దెయ్యం కాదు.. ఆ శక్తి వెనుక ఉన్న శాపం, గతంలో జరిగిన విషాద సంఘటనలు, దాని నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలే కథలో కీలకంగా మారతాయి. చిత్రంలో భయానక వాతావరణం, ప్రాక్టికల్ హారర్ ఎఫెక్ట్స్, సస్పెన్స్, రక్తికట్టించే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. సాధారణ హారర్ కథలా కాకుండా, పాత్రల భయం, పోరాటం, ప్రాణాల కోసం చేసే ప్రయత్నాల చుట్టూ కథ సాగుతుంది.

మొత్తంగా..‘ఈవిల్ డెడ్ బర్న్’ అనేది ఒక శాపగ్రస్త శక్తి, దాని బారిన పడిన మనుషులు, ఆ చీకటి నుంచి బయటపడేందుకు చేసే పోరాటం నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్. హారర్ జానర్ అభిమానులకు భయంతో పాటు ఉత్కంఠను అందించే చిత్రం.

బాక్సాఫీస్:

ఈ మూవీ సుమారు రూ.160 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. హారర్, థ్రిల్, మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సుమారు $6.3 కోట్ల డాలర్లకు పైగా (భారత కరెన్సీలో రూ. 550 కోట్లకు పైగా) వసూళ్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత, ఈ సినిమాను అమెరికా మరియు కెనడాలో ప్రీమియం డిజిటల్ (VOD) ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేశారు. త్వరలోనే ఇతర ప్రముఖ ఓటీటీ వేదికలలో కూడా ఇది స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.