OTT Thriller: వీకెండ్‌కు పర్ఫెక్ట్ తమిళ్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అంటే?

OTT Thriller: వీకెండ్‌కు పర్ఫెక్ట్ తమిళ్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అంటే?

కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా 'వంద దేవుళ్లు' (తమిళంలో 'నూరు సామి'). మంచి అంచనాల మధ్య 2026 జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇవాళ ఆగస్ట్ 7న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు జీ5లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓ తల్లి, ఆమె ఇద్దరు కుమారుల జీవితాల చుట్టూ సాగుతుంది. నలభై ఏళ్లు దాటిన ఓ మహిళ తన జీవితంలో మరోసారి తోడు కోసం ఆలోచించినప్పుడు ఎదురయ్యే సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ పరిస్థితులు, బంధువుల విమర్శలు, సమాజం చూపే వివక్షను హృద్యంగా ఆవిష్కరిస్తుంది. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ కుటుంబ బంధాల విలువను హృదయాన్ని తాకేలా చూపించిన చిత్రం ఇది.

కథేంటంటే?

ఒక మారుమూల పల్లెటూరులో వాసవి ( స్వాసిక ) అనే మధ్యవయస్కురాలైన ఒంటిరి తల్లి, తన ఇద్దరు కొడుకులను ఎంతో కష్టపడి పెంచుతుంది. అయితే ఒకానొక దశలో తోడు కోసం మళ్లీ పెళ్లి చేసుకోవాలని వాసవి భావిస్తుంది. అయితే దీనిని తన పెద్ద కొడుడు బాస్కర్ వ్యతిరేకిస్తాడు. ఈ వయసులో వివాహం చేసుకుంటే సమాజం చిన్న చూపు చూస్తుందని అడ్డుచెబుతారు. కొంత కాలం తర్వాత పెద్ద కొడుకు తన మనసు మార్చుకుంటాడు. తల్లికి తోడు కావాలిని మళ్లీ పెళ్లి చేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే కాలం మించిపోతుంది. తల్లి నో అంటుంది. ఈ ఎమోషనల్ మైండ్ గేమ్‌లోకి మన హీరో ఏడుకొండలు (విజయ్ ఆంటోనీ) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? చుట్టుపక్కల జనం, చుట్టాల రియాక్షన్ ఏంటి? అనేదే అసలు సిసలైన ట్విస్ట్.. ఒక యథార్థ సంఘటన ఆధారంగా శశి ఈ కథను పీక్స్ ఎమోషన్స్‌తో మలిచారు.

సినిమా ఎలా ఉందంటే?

నిజ జీవిత వయసు కంటే చాలా పెద్దదైన క్యారెక్టర్ చేయాలంటే ఏ హీరోయిన్‌కైనా మామూలు గట్స్ సరిపోవు. స్వాసిక ఆ ఛాలెంజ్‌ను చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది. వాసవి పాత్రలో ఆమె పలికించిన హావభావాలు, ఎమోషనల్ డెప్త్ సినిమాకే అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే విజయ్ ఆంటోనీ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్ , ఎనర్జీతో థియేటర్‌లో వైబ్స్ మార్చేశాడు. స్వాసిక, విజయ్ ఆంటోనీల మధ్య వచ్చే ప్రతి సీన్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అజయ్ ధీషన్ కొడుకు పాత్రకు పూర్తి న్యాయం చేయగా, సపోర్టింగ్ రోల్స్‌లో లిజోమోల్ జోస్, కరుణాస్, బాలాజీ శక్తివేల్ నటన సినిమాకు మరింత వెయిట్ తెచ్చింది.

ALSO READ : Pallaburusu Trailer: ఆసక్తి పెంచుతున్న ‘పళ్ళ బురుసు’ ట్రైలర్...

సమాజంలో ఒంటరి మహిళలు ఎదుర్కొనే సమస్యను ప్రాక్టికల్‌గా ఒక ఎమోషనల్ లో చూపించారు దర్శకుడు. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ స్క్రీన్‌ప్లే ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది.విలేజ్ అట్మాస్ఫియర్ విజువల్స్ పల్లెటూరిని గుర్తుచేస్తాయి. భాష్యశ్రీ రాసిన తెలుగు డైలాగ్స్ గుండెకు హత్తుకుంటాయి. మొత్తానికి స్లోగా సాగే ఫస్టాఫ్ పక్కన పెడితే.. ప్యూర్ ఎమోషన్స్, అద్భుతమైన నటన కోసం 'వంద దేవుళ్లు' చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఒకసారి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు.