టెహ్రాన్‌లో భారీ పేలుడు.. ర్యాలీ జరుగుతుండగా పెద్ద శబ్దంతో భారీ బ్లాస్ట్

టెహ్రాన్‌లో భారీ పేలుడు.. ర్యాలీ జరుగుతుండగా పెద్ద శబ్దంతో భారీ బ్లాస్ట్

టెహ్రాన్‌: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు సంభవించింది. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు నిరసన చేస్తుండగా ర్యాలీ చేస్తున్న ప్రాంతంలో బ్లాస్ట్ జరిగింది. అయితే.. ఒక బిల్డింగ్పై బాంబు పడటంతో ర్యాలీ చేస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ర్యాలీ సమయంలో బ్లాస్ట్ జరగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. వందల మంది రోడ్ల మీదకొచ్చి టెహ్రాన్ స్క్వేర్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ర్యాలీకి ఇరాన్ సెక్యురిటీ చీఫ్ అలీ లారిజానీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టు తెలిసింది.

రంజాన్ మాసంలో చివరి శుక్రవారం రోజు ప్రపంచవ్యాప్తంగా అల్-ఖుద్స్ డే పేరుతో ర్యాలీలు నిర్వహిస్తుంటారు. 1979లో అయతుల్లా ఖమేనీ దీనిని ప్రారంభించారు. పాలస్తీనాకు మద్దతు తెలపడంతో పాటు జెరూసలెంపై ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని నిరసించడమే ఈ నిరసనల ముఖ్య ఉద్దేశం. మార్చి 13న అల్-ఖుద్స్ డే కావడంతో ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకొచ్చి ఇజ్రాయెల్-అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఈ ర్యాలీ టార్గెట్గా ఇజ్రాయెల్ బాంబు దాడికి యత్నించింది. ర్యాలీ జరుగుతున్న వీధిలో ఉన్న బిల్డింగ్పై బాంబు పడటంతో కలకలం రేగింది. ఇదిలా ఉండగా.. అమెరికా జెట్ US KC-135 అదుపు తప్పి ఇరాక్లో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది.