పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో అసక్తిగా 'ఉస్తార్ భగత్ సింగ్ ' చిత్రం రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పడు విడుదల డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు.
గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్..
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ ను మార్చి 15న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు రెడీ చేస్తున్నారు. దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర నటీనటులు, సిబ్బంది హాజరు కానున్నారు.
ట్రెండింగ్ లో 'కాలరే ఎత్తరా'
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు మేకర్స్ . 'ఎత్తరా.. ఎత్తరా.. కాలరే ఎత్తరా' మాస్ బీట్ సాంగ్ పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ పవర్ పుల్ బీట్స్ కు పవన్ కళ్యాణ్ ఎనర్జీ తోడవడంతో ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాసర్ల శ్యామ్ ఈ పాటను రచించారు. రామ్ మిర్యాల పాడిన ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
ALSO READ : యానిమేషన్ ప్రపంచంలోకి అనిల్ రావిపూడి ఎంట్రీ..
రన్ టైం ఎంతంటే?
ఈ మూవీకి సెన్సార్ బోర్డు 'యూ/ఏ' (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఒక్క కట్ కూడా లేకుండా జీరో కట్స్ తో ఈ మూవీ సెన్సార్ నుంచి పాస్ అయినట్లు సమాచారం. ఈ మూవీ రన్ టైమ్ మొత్తం 2 గంటల 33 నిమిషాల 59 సెకన్లు. ఇందులో పస్ట్ హాఫ్ రన్ టైం గంట 11 నిమిషాల 30 సెకన్లు. సెకాండాఫ్ రన్ టైం గంట 22 నిమిషాల 29 సెకన్లు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
భారీ తారాగణం..
పవన్ కళ్యాణ్ సరసన ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే ఆర్. పార్థిబన్, అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు . హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, తమన్ బీజీఎం, దశరథ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. 'గబ్బర్ సింగ్' మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, ఈ మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరి..
