సుక్మా అడవుల్లో మావోయిస్టు వారోత్సవాలు

సుక్మా అడవుల్లో మావోయిస్టు వారోత్సవాలు

భద్రాచలం, వెలుగు: ఏజెన్సీ ఏరియాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు, కూంబింగ్​ చేపట్టినప్పటికీ మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నాయి. గతనెల 28 నుంచి నక్సల్స్​దండకారణ్యంలోని వేర్వేరు ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. చత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో నిర్వహించిన సభలకు సంబంధించిన వీడియోలు బయటికి వచ్చాయి. సుక్మా జిల్లా నాగారం అటవీ ప్రాంతంలో సాయుధ బలగాల పహారా నడుమ వందల మంది గిరిజనుల సమక్షంలో సభలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే జన నాట్య మండలి కళాకారులు విప్లవ గీతాలు ఆలపిస్తూ.. ఏడాదిగా పోలీస్​ ఎన్‍కౌంటర్లలో, అనారోగ్యంతో మరణించిన విప్లవకారులను స్మరించుకున్నారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు ఎన్ని నిర్బంధాలు విధించినా మావోయిస్టులు సభలు, సమావేశాలు నిర్వహిస్తుండటం గమనార్హం. నేటితో వారోత్సవాలు ముగియనున్నాయి.