
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ పెద్ద గోడపై నుండి దూకుతున్న షాకింగ్ సంఘటన కెమెరాలో రికార్డైంది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త ,ఆమె అత్తమామల నుంచి తప్పించుకోవడానికి ముఖంపై గుడ్డ కప్పుకున్న మహిళ గోడపై నుండి దూకుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఆ మహిళ తన ప్రియుడితో కలిసి ఓయో హోటల్‌లో తిరుగుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించి అత్తమామలు ఈ సంఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేశారని తెలుస్తోంది.
#Baghpat
— News1India (@News1IndiaTweet) June 17, 2025
ससुरालियों ने विवाहित महिला को होटल में प्रेमी के साथ पकड़ा
होटल की पिछली खिड़की से कूदकर महिला हुई मौके से फरार
होटल की दीवार से कूदते हुए ससुरालियों ने बनाया वीडियो
मौके पर पुलिस बुलाकर ससुरालियों ने की मामले की शिकायत
पति ने पत्नी से जान का खतरा होने की कही बात… pic.twitter.com/dP76rmovgr
యూపీలోని బాగ్‌పత్‌లోని బరౌత్ ప్రాంతంలో ఈఘటన జరిగింది. ప్రియుడితో పట్టుబడిన తర్వాత తప్పించుకునేందుకు వివాహిత హోటల్ పైకప్పు నుండి దూకినట్లు తెలుస్తోంది.
ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి బరౌట్‌లోని ఓయో హోటల్‌లో ఉంటోంది. సమాచారం తెలుసుకున్న ఆమె అత్తమామలు ఆమె భర్త ,పోలీసులతో కలిసి హోటల్‌కు రావడంతో భర్తను, పోలీసులను చూడగానే భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది. దాదాపు 12 అడుగుల ఎత్తున్న హోటల్ పైకప్పు నుంచి దూకి అక్కడి నుంచి పారిపోయింది.
ALSO READ | viral Video:రన్నింగ్ బైక్పై ప్రేమజంట రొమాన్స్..దిమ్మతిరిగే షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
ఈ మొత్తం సంఘటనను ఆమె భర్త కుటుంబానికి చెందిన ఒకరు మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు.ఆ మహిళ హోటల్ వెనుక కిటికీ నుంచి దూకుతున్న దృశ్యం కెమెరాకు చిక్కాయి.
గత కొంతకాలంగా ఆ మహిళకు భర్తతో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు చెప్పాడు. తన భార్య ప్రేమికుడితో కలిసి తనను చంపేస్తుందని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అధికారిక ఫిర్యాదు ఏమీ లేదు. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కూడా నివేదికలు లేవు.