viral Video:రన్నింగ్ బైక్పై ప్రేమజంట రొమాన్స్..దిమ్మతిరిగే షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

viral Video:రన్నింగ్ బైక్పై ప్రేమజంట రొమాన్స్..దిమ్మతిరిగే షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

 ప్రేమ జంటల పబ్లిక్ రొమాన్స్ ఘటనలు ఈమధ్యకాలంలో బాగా పెరిగిపోయాయి. చుట్టూ జనం ఉన్నారు..నడిరోడ్డుపై వాహనంపై వెళ్తున్నామనే సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు.పబ్లిక్ గానే హద్దులు మీరి గాల్లో తేలుతూ ముద్దుల వర్షం కురిపిస్తున్నారు. బైకులు, కార్లలో వెళ్తూ అందరూ చూస్తు్న్నా సిగ్గులేకుండా అదేదో ఫ్యాషన్ అన్నట్లుగా బహిరంగంగానే రొమాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అయితే ఇలాంటి చూస్తే ట్రాఫిక్ పోలీసులు ఊరుకుంటారా.. ఇలా చేసిన వారికి దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. తాజాగా యూపీలోని నోయిడాలో కూడా బైక్ పై వెళ్తూ పబ్లిక్ రొమాన్స్ చేస్తున్న జంటకు  అదే చేశారు ట్రాఫిక్ పోలీసులు. 

నోయిడా హైవేపై ఓ జంట పబ్లిక్ గానే బైక్ పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. యువకుడు బైక్ నడుపుతుండగా..యువతి ముందు పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొని హగ్ చేసుకొని అతని ముఖంపై ముద్దుల వర్షం కురిపిస్తోంది.. అలా బహిరంగంగా రొమాన్స్ చేస్తున్న వారికి బాగానే ఉన్నా.. చూస్తున్న ఇతర వాహనదారులకు కొంచెం జుగుప్స కలిగించింది. దీంతో పబ్లిక్ రొమాన్స్ సీన్లను కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో నోయిడా పోలీసులకు చేరింది. ఇంకేముంది వీళ్లకు తగిన బుద్ది చెప్పాల్సిందే అనుకున్నారు పోలీసులు. 

ALSO READ  | ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కొత్త వీడియో.. ఓ పక్క మంటలు..భయంతో భవనంపైనుంచి దుంకుతున్న మెడికోలు..

నోయిడా హైవేపై బైక్ రొమాన్స్ వీడియో ట్రాఫిక్ పోలీసులకు చేరడంతో చర్యలకు రెడీ అయ్యారు.  ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు, తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగించినందుకు భారీ జరిమానా విధించారు. ఏకంగా 53వేల 500 రూపాయల ఫైన్ వేశారు. బైక్ సీజ్ చేశారు. 

ఇక వైరల్ అవుతున్న బైక్ రొమాన్స్ వీడియోపై నెటిజన్లనుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది పబ్లిక్ రొమాన్స జంటకు సపోర్టు చేస్తూ.. ఇంత జరిమానా వేస్తారా.. ఇదెక్కడి అన్యాయం అన్నట్లు రాశారు. ఏ రూల్ ప్రకారం ఇంత ఫైన్ వేశారు అని ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఫైన్ సంగతి ఎలా ఉన్నా.. పబ్లిక్ లో రొమాన్స్ ఏంటమ్మా.. అని మరికొందరు నెటిజన్లు స్పందించారు.