హైదరాబాద్ అసిఫ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఫర్నిచర్ తయారీ యూనిట్ లో మంటలు..

హైదరాబాద్ అసిఫ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఫర్నిచర్ తయారీ యూనిట్ లో మంటలు..

హైదరాబాద్ అసిఫ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. స్థానిక అబూబకర్ మసీదు సమీపంలోని ఓ ఫర్నిచర్ తయారీ యూనిట్ లో చోటు చేసుకుంది ఈ ప్రమాదం. శనివారం ( జూన్ 21 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

మూడంతస్తులు ఉన్న ఫర్నిచర్ తయారీ యూనిట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కి మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ కమ్ముకుంది.గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్ నుంచి మంటలు ప్రారంభమై ఫస్ట్ ఫ్లోర్ వరకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లోని 4వ అంతస్తులో 13 మంది చిక్కుకున్నారుఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించచారు స్థానికులు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ALSO READ | ఇల్లు లేనోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

మంటలు తీవ్రమైన కారణంగా యాకత్పురా ఫైర్‌స్టేషన్, హైదరాబాద్ జిల్లా SDRF బృందం, లంగర్‌హౌస్ ఫైర్‌స్టేషన్ బృందం, సెక్రటేరియట్ నుంచి బ్రాంటో స్కై లిఫ్ట్ లాడర్‌ను కూడా సంఘటనా స్థలానికి పంపించారు. అప్పటికే అక్కడ ఉన్న బృందాలు మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పేశారు.

SDRF సాయంతో పై అంతస్తుల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.