
మరికల్, వెలుగు: ఇల్లు లేనోళ్లకే ముందుగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తెలిపారు. శుక్రవారం మరికల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 3,500 ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చి వారి కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
గుడిసెల్లో ఉంటున్న వారి ఇండ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వానాకాలంలో నీళ్లు, పాములు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీగా అందరికీ ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. నిరుపేదల కష్టాలను తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. డీఈ హరికృష్ణ, ఎంపీడీవో కొండన్న, పార్టీ నాయకులు సూర్యమోహన్రెడ్డి, గొల్ల కృష్ణయ్య, బి.వీరణ్ణ, రాములు, హరీశ్, రామకృష్ణ, గొల్ల రాజు, గోపాల్, రామకృష్ణారెడ్డి, తిరుమలయ్య, చెన్నయ్య పాల్గొన్నారు.