మక్తల్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తా : మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తా : మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్(మాగనూర్), వెలుగు: మక్తల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్​ హబ్ గా మారుస్తానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మాగనూరు జడ్పీ హైస్కూల్​ హెచ్ఎం మురళీధర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లేనని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు విద్యార్థులు కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని సూచించారు. 

ప్రభుత్వ బడుల్లో చదివిన వారే ఎక్కువగా సివిల్స్ కు ఎంపికవుతున్నారని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందని పేర్కొన్నారు.  మక్తల్ లో రూ.230 కోట్లతో 25 ఎకరాల్లో త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభమవుతుందని చెప్పారు.  సర్పంచ్ దండు జనార్ధనమ్మ, స్కూల్ కమిటీ చైర్​పర్సన్ ఇందిరమ్మ, టీచర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.