హన్వాడ పీఎస్ ను సందర్శించిన ఎస్పీ

హన్వాడ పీఎస్ ను సందర్శించిన ఎస్పీ

హన్వాడ , వెలుగు : హన్వాడ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోమవారం  ఎస్పీ డి.జానకి సందర్శించారు. పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి మరియు స్టేషన్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఆమెతోపాటు  హన్వాడ ఎస్ఐ వెంకటేశ్​ ఉన్నారు.