నారాయణపేట కలెక్టర్ గా  ప్రతీక్ జైన్  

నారాయణపేట కలెక్టర్ గా  ప్రతీక్ జైన్  

నారాయణపేట, వెలుగు :  నారాయణపేట జిల్లా  నూతన కలెక్టర్ గా ప్రతీక్ జైన్  సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఏవో శ్రీధర్, జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలు, నోట్ పుస్తకాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.