కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. కుక్క కాటుకు రెండేళ్ల చిన్నారి బలయ్యింది. ఇటీవల కుక్క కాటుకు గురైన చిన్నారి ఆదివారం ( ఫిబ్రవరి 1 ) ఆసుపత్రిలో మూడో డోస్ ఇంజక్షన్ తీసుకుంటుండగా.. మృతి చెందటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
కామారెడ్డి పరిధిలోని అయ్యప్ప నగర్ కు చెందిన క్రితార శ్రీ అనే రెండేళ్ల చిన్నారి కుక్క కాటుతో మృతి చెందింది. జనవరి 25న చిన్నారిని పిచ్చి కుక్క కరువగా.. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడో డోస్ ఇంజక్షన్ తీసుకుంటుండగా.. చిన్నారి మృతి చెందింది.
ఈ క్రమంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబసభ్యులు. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు.దీంతో ఆసుపత్రి దగ్గర భారీగా మోహరించారు పోలీసులు.
