పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
  • మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​కు సీపీఎస్ఈయూ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  పాత పెన్షన్‌‌ విధానాన్ని (ఓపీఎస్‌‌) పునరుద్ధరించాలని సీపీఎస్‌‌ ఎంప్లాయిస్‌‌ యూనియన్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌‌ శ్రీకాంత్‌‌ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం యూనియన్‌‌ ప్రతినిధులతో కలిసి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.  గత 22 ఏండ్లుగా సీపీఎస్‌‌ ఉద్యోగులు, టీచర్ల కష్టార్జితంతో పాటు ప్రభుత్వ వాటా సొమ్ము షేర్‌‌ మార్కెట్‌‌కు వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రూ.20 వేల కోట్లు ఎన్‌‌పీఎస్‌‌ ట్రస్ట్‌‌ ద్వారా షేర్‌‌ మార్కెట్‌‌కు వెళ్లాయని తెలిపారు. 

వరంగల్‌‌ డిక్లరేషన్‌‌ సభలో సీపీఎస్‌‌ను రద్దు చేస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు.  వినతిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. సీపీఎస్‌‌లోని లోపాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ అంశంపై సీఎంతో చర్చిస్తామని శ్రీధర్‌‌బాబు హామీ ఇచ్చారు.   కార్యక్రమంలో యూనియన్‌‌ నేతలు నరేందర్‌‌రావు, సురేందర్‌‌రెడ్డి, శ్యామ్‌‌సుందర్‌‌, శ్రీనివాస్‌‌, భాస్కర్‌‌ తదితరులు పాల్గొన్నారు.