HCL స్క్వాష్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ఏ చాలెంజర్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో  క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు సూరజ్‌‌‌‌‌‌‌‌

HCL స్క్వాష్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ఏ చాలెంజర్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో  క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు సూరజ్‌‌‌‌‌‌‌‌

కోల్‌‌‌‌‌‌‌‌కతా: ఇండియా స్క్వాష్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ సూరజ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ చంద్‌ హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ స్క్వాష్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ఏ చాలెంజర్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో నాలుగోసీడ్‌‌‌‌‌‌‌‌ సూరజ్‌‌‌‌‌‌‌‌ 11–4, 8–11, 11–2, 9–11, 11–8తో హసన్‌‌‌‌‌‌‌‌ మెన్షావీ (ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. 73 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో సూరజ్‌‌‌‌‌‌‌‌ కీలక టైమ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా పాయింట్లు గెలిచాడు. 

ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో సందేశ్‌‌‌‌‌‌‌‌ పళనివేల్‌‌‌‌‌‌‌‌ 6–11, 10–12, 11–5, 11–6, 11–7తో అయాన్‌‌‌‌‌‌‌‌ వజిరాలీ, శౌర్య బవా 8–11, 11–6, 11–3, 11–3తో ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ కురితామ్‌‌‌‌‌‌‌‌ (ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో తన్వీ ఖన్నా 11–3, 11–6, 11–7తో వసుందరపై, నిరూపమ దూబే 11–8, 11–5, 11–4తో వయోమికా ఖండేవాలపై నెగ్గి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు.