న్యూఢిల్లీ: పుణె వేదికగా16వ హాకీ ఇండియా జూనియర్ విమెన్స్ నేషనల్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 30 జట్లు మూడు డివిజన్లలో పోటీపడనున్నాయి. జాతీయ టైటిల్‌తో పాటు జట్ల పదోన్నతి, రెగ్యులేషన్ కోసం ఈ పోటీలు జరగనున్నాయి. డివిజన్–ఎలో 12 జట్లు నాలుగు పూల్స్‌గా విడిపోయి మ్యాచ్‌లు ఆడనున్నాయి.
పూల్–ఎలో జార్ఖండ్, పంజాబ్, చండీగఢ్ ఉన్నాయి. పూల్–బిలో హర్యానా, ఒడిశా, బెంగాల్ జట్లు ఉన్నాయి. పూల్–సిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్ ఉండగా, పూల్–డిలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. ప్రతి పూల్ నుంచి టాప్–2 జట్లు ఈ నెల 20న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. 21న సెమీఫైనల్స్, 23న ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
