ప్రతిరోజూ రూ.4 వేల కోట్లు ఇన్కమ్.. కండ్లు చెదిరే రీతిలో అదానీ, అంబానీల సంపాదన

ప్రతిరోజూ రూ.4 వేల కోట్లు ఇన్కమ్.. కండ్లు చెదిరే రీతిలో అదానీ, అంబానీల సంపాదన

న్యూఢిల్లీ: మన దేశంలోని టాప్– 300 కుటుంబ వ్యాపారాలు 2024 నుంచి తమ సంపదను దాదాపు రూ.30 లక్షల కోట్లు పెంచుకున్నాయి. గత రెండేళ్లలో ప్రతిరోజూ సుమారు రూ.4,076 కోట్లు వెనకేశాయి. బార్​క్లేస్​ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యబుల్ ఫ్యామిలీ బిజినెసెస్​ లిస్ట్​ –2026 ఈ వివరాలను వెల్లడించింది.

ఈ వ్యాపారాల సంయుక్త విలువ రూ.138 లక్షల కోట్లు ఉంది.  కొన్ని కుటుంబాలు వేగంగా సంపదను కూడబెట్టుకుంటుండగా, మరికొన్ని వెనుకబడిపోతున్నాయి. గత మూడేళ్లలో జిందాల్ కుటుంబం జేఎస్​డబ్ల్యూ స్టీల్ ద్వారా రూ.3.3 లక్షల కోట్లు సంపాదించింది. అనిల్ అగర్వాల్ కుటుంబం వేదాంత సంస్థ డీమెర్జర్ ద్వారా రూ.3.03 లక్షల కోట్లు ఆర్జించింది.

కుమార మంగళం బిర్లా కుటుంబం ఆదిత్య బిర్లా గ్రూప్ ద్వారా రూ.2.75 లక్షల కోట్లను అదనంగా సాధించింది.  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్  ప్రమోటర్లయిన నాడార్ కుటుంబం అత్యధికంగా రూ.1.39 లక్షల కోట్లను కోల్పోయింది. ఇది 32శాతం పతనానికి సమానం. డీఎల్ఎఫ్ సంస్థకు చెందిన రాజీవ్ సింగ్ కుటుంబం రూ.51 వేల కోట్లు నష్టపోయింది. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పతనం తీవ్ర ప్రభావం చూపింది.

అంబానీ కుటుంబం వద్ద రూ.25.8 లక్షల కోట్లు

అంబానీ కుటుంబం వరుసగా మూడో ఏడాది కూడా దేశంలోనే అత్యంత విలువైన కుటుంబ వ్యాపారంగా నిలిచింది. ఆయన కుటుంబం వ్యాపార విలువ రూ.25.8 లక్షల కోట్లుగా ఉంది. కుమార మంగళం బిర్లా కుటుంబం రూ.8.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. జిందాల్ కుటుంబం రూ.8.02 లక్షల కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకోగా బజాజ్ కుటుంబం రూ.7.7 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 

మహీంద్రా కుటుంబం రూ.5.15 లక్షల కోట్లతో ఐదో స్థానాన్ని పొందింది. మొదటి తరం వ్యాపారాలలో అదానీ కుటుంబం రూ.19.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారతి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ సునీల్ భారతి మిట్టల్ కుటుంబం రూ.12.1 లక్షల కోట్లతో రెండో స్థానంలో, సన్ ఫార్మాస్యూటికల్స్ దిలీప్ సంఘ్వీ కుటుంబం రూ.4.55 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి. 

ఈ జాబితా మొత్తం విలువ 2024 నుంచి 27.5శాతం పెరిగింది. ఇదే కాలంలో నిఫ్టీ 50 సూచీ 1.1శాతం పడిపోగా సెన్సెక్స్ 3.7శాతం తగ్గింది. లోహాలు, ఆటోమొబైల్స్ రంగాలలోని కుటుంబాలు భారీగా సంపాదిస్తుండగా, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్, రియల్ ఎస్టేట్ రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సరైన రంగంలో వ్యాపారం చేసే వారికి భారతదేశంలో ఇది సువర్ణావకాశమని రిపోర్ట్​ పేర్కొంది.